చాలామంది గర్భిణులు అధిక ఒత్తిడితో వుండటం వల్ల అబార్షను ముప్పు కలుగుతోందంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఎల్లప్పుడూ గర్భిణులు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండాలట. గర్భిణి కోపతాపాలకి లోనయితే గర్భస్థ శిశువు ఆరోగ్యం తారుమారు అవుతుందట.
గర్భస్థ శిశువు ఆరోగ్యమే కాదు గర్భిణీ ఆరోగ్యం కూడా పాడవుతుందట. మానసిక ఒత్తిడి వల్ల గర్భిణీలో బిపి, షుగర్‌లు తలెత్తుతాయట. గర్భిణీలోని బిపి, షుగరులు ఆమెకు ఎంతో హాని కలిగిస్తాయి. గర్భిణీలో కలిగే మానసిక ఒత్తిడి వల్ల మెడనొప్పులు, నడుం నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పులు కలుగుతాయట. నిరంతరం నీరసంగా ఉంటుందట. నిద్ర పట్టదట.
దీంతో ఆమె ఇబ్బందులు పాలవడమే కాకుండా గర్భస్థ శిశువు కూడా సమస్యలు తలెత్తుతాయి. గర్భిణీకి తగినంత నిద్ర అత్యంత అవసరం. నిద్ర లేకపోతే గర్భిణీలో రకరకాల అనారోగ్యాలు కలుగుతాయి. బాధలు కలుగుతాయి. గర్భిణీగా ఉన్నప్పుడు కలిగే ఆవేశాలు, కోపతాపాలు, చికాకులు, చిర్రుబుర్రులు గర్భస్రావానికి దారి తీస్తాయట.
ఒకవేళ గర్భం కొనసాగినా నెలలు నిండకుండా కాన్పు అయిపోయే ప్రమాదం ఉందట. తల్లి ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే బిడ్డలో కూడా అలజడి కలుగుతుందట. దీనికి కారణం తల్లిలో నుంచి స్ట్రెస్ హార్మోన్లు బిడ్డకి చేరడమే. ఆ స్ట్రెస్ హార్మోస్లు బిడ్డలో కూడా మార్పులు తీసుకువస్తాయట.