Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప్పు వల్ల ప్రయోజనాలు ఎన్నో...

ఉప్పు వల్ల ప్రయోజనాలు ఎన్నో...
, గురువారం, 5 సెప్టెంబరు 2019 (15:59 IST)
కూరల్లో తప్పనిసరిగా వేసే పదార్థాల్లో ఉప్పు ఒకటి. దాన్ని వంటల్లోనే కాదు, ఇలా కూడా వాడవచ్చు.
 
*వంటింటి గట్టు మీద గుడ్డు పగిలిపోయిందా? దానిపై కాస్త ఉప్పు చల్లి ఇరవై నిమిషాల తరువాత శుభ్రం చేస్తే చాలు. గుడ్డు వాసన రాదు.
 
*ఒక్కోసారి కాఫీ పొడి ఎక్కువై కాఫీ చేదుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ డికాక్‌షన్‌లో చిటికెడు ఉప్పు కలిపి చూడండి. 
 
*కొందరిలో అలసట, నిద్రలేమి వల్ల కళ్ల కింద చర్మం ఉబ్బుతుంది. దీన్ని తగ్గించాలంటే కప్పు గోరువెచ్చటి నీటిలో అరచెంచా ఉప్పు కలపాలి. ఈ నీటిలో శుభ్రమైన నూలు వస్త్రాన్ని కాసేపు ఉంచాలి.  దాంతో కళ్ల అడుగున మృదువుగా అద్దినట్లు చేస్తే ఆ వాపు తగ్గుతుంది.
 
*దుమ్ముపట్టిన ప్లాస్టిక్ పూలను ఒక పేపరు బ్యాగులో ఉంచి, అందులో కాస్త ఉప్పు వేసి బాగా కుదుపాలి. ఇలా చేస్తే పూలకు ఉన్న దుమ్ముధూళీ పోయి శుభ్రపడతాయి.
 
*బూట్లలో రాత్రిపూట కొద్దిగా ఉప్పు చల్లి చూడండి. వాటి నుంచి దుర్వాసన రాదు.
 
*చేపల తొట్టెను శుభ్రం చేయడానికి కూడా ఉప్పు కలిపిన వేడి నీటిని ఉపయోగిస్తే, దుర్వాసన సమస్య ఉండదు.
 
*కొత్త తువాళ్లు రంగు పోకుండా ఉండాలంటే, మొదటిసారి ఉతికేటప్పుడు ఉప్పు నీటిలో కసేపు నానబెడితే చాలు, రంగు పోదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ వర్షంలో తడుస్తున్నారా? అయితే, ఇలా చేయండి...