ఇదివరకటి రోజుల్లో ఇంగువ లేని వంటకమే ఉండేది కాదు. ఇంగువ వాసన కాస్త భరించలేనిదిగా వుంటుంది కానీ ఇందులో ఔషధ గుణాలు అధికంగానే ఉన్నాయి. దీని ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
1. శరీరంలో ఎక్కడైనా ముల్లు గుచ్చుకునుంటే ఆ ప్రాంతంలో ఇంగువ ద్రవం పోస్తే కాసేపు తర్వాత ఆ ముల్లు దానంతట అదే బయటికి వచ్చేస్తుంది.
2. ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, నవ్వ, ఇతర చర్మ వ్యాధులకు ఇంగువ మంచిమందు. కాసింత నీటిలో ఇంగువను రుద్ది ఆ ద్రవాన్ని చర్మంపై పూస్తే ఉపశమనం కలుగుతుంది.
3. ఊపిరి తిత్తులు, ఉదర సంబంధమైన వ్యాధులకు ఇంగువ మంచి ఔషధంలా పని చేస్తుంది.
4. మలబద్దకం ఉన్నవారు రాత్రి పడుకోబోయే ముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే ఉదయానికల్లా ఫ్రీ... ఒగరుగా ఉంటుందనుకుంటే కాస్త తీయటి సోడాలో కలిపి తీసుకుంటే సరి.
5. పళ్ళు పుచ్చిపోయి వుంటే రాత్రి పడుకునే ముందు కాస్త ఇంగువ ఆ పంటిపై ఉంచితే అందులో ఉన్న క్రిములు మటుమాయం.
6. కడుపులో పురుగులు ఉంటే ఇంగువ నీళ్ళలో కలిపి తీసుకుంటే పురుగులు మటుమాయం.
7. ప్రతి రోజు భోజనంలో ఇంగువ ఉండేలా చూసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుందని వైద్యులు పేర్కొన్నారు.