Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్పాహారం తీసుకోకపోతే శృంగారం కావాలంటారట...

Advertiesment
అల్పాహారం తీసుకోకపోతే శృంగారం కావాలంటారట...
, మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (21:36 IST)
ఉదయంపూట అల్పాహారం తీసుకోని వారు చిన్న వయస్సులోనే శృంగార అనుభవాలను చవిచూస్తారని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారానికీ, శృంగారానికీ గల సంబంధ బాంధవ్యాల గురించి ఇప్పటిదాకా అనేక రకాల సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, తాజా అధ్యయన సంగతులు మాత్రం కాస్తంత ఆలోచింపజేస్తున్నాయి.
 
ఇక వివరాల్లోకి వస్తే... జపాన్‌కు చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం బ్రేక్‌ఫాస్ట్ అంశానికి సంబంధించి దాదాపు మూడువేలమందిపై అధ్యయనం జరిపారు. పద్ధతిగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేవారు 19 ఏళ్ల సగటు వయసులో తొలి శృంగార అనుభవాన్ని చవిచూస్తున్నారని, ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్ జోలికి పోనివారు మాత్రం 17.5 ఏళ్ల వయస్సులోనే శృంగారానుభవం పొందారని ఈ అధ్యయనం ద్వారా తేలిందని వారు చెబుతున్నారు.
 
క్రమశిక్షణ కలిగిన కుటుంబం లేనివారు, తగవులు పడే తల్లిదండ్రులు ఉన్నవారు తీవ్రమైన నిరాశా నిస్పృహలకు గురై... వాటినుండి బయటపడేందుకు అతి తక్కువ వయస్సులోనే శృంగారానుభవం కోసం పాకులాడుతుంటారని జపాన్ పరిశోధకులు వివరిస్తున్నారు. ఇలాంటివారే ఉదయంపూట ఆహారం తీసుకునేందుకు ఇష్టపడరని వారంటున్నారు. కాబట్టి, తగవులు పడే తల్లిదండ్రులు వారి పిల్లల గురించి జాగ్రత్తగా ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఒక్కటి చేస్తే చాలు... అన్ని అనారోగ్యాలను అధిగమించవచ్చు...