Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చరిత్ర తిరగరాసిన సాహో.. కలెక్షన్లు చూస్తే కళ్ళు తిరుగుతాయ్..

Advertiesment
Sahoo
, శనివారం, 31 ఆగస్టు 2019 (14:43 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో అతిపెద్ద భారీ కలెక్షన్ మూవీ. తన రికార్డులను తానే తిరగరాసుకున్న ప్రభాస్. సాహో సినిమా భారతదేశంలో 100 కోట్లు, ఓవర్సీస్‌లో సైతం భారీ వసూళ్లను రాబడుతూ అంతర్జాతీయ చిత్ర పరిశ్రమను నివ్వెరపరిచింది. కలెక్షన్లను చూసి విస్మయం, ఆశ్చర్యపోతున్నారు సినీవిశ్లేషకులు. 
webdunia
హిందీ, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో 100 కోట్లు క్రాస్ చేసిందనీ, ఓవర్సీస్ లో సైతం మెరుగైన కలెక్షన్లు రాబడుతోందని సమాచారం. ఏ భారతీయ సినిమా ఈ రికార్డ్ కలెక్షన్ సాధించలేదట. 80 యేళ్ళ సినీ చరిత్రలో బాహుబలి సృష్టించిన రికార్డును సాహో 100 కోట్ల వసూలు చేసి ఆ రికార్డును తిరగరాసుకుందట.

మరో మూడు రోజుల పాటు సినిమా టిక్కెట్లు అసలు దొరకడం లేదు. అన్నీ సినిమా థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్సనమిస్తున్నాయి. ఈ లెక్కలన్నీ కలిపితే సాహో రూ. 240 కోట్ల కలెక్షన్లకు చేరుకునే అవకాశం వున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ సాహోలో ఆర్ట్‌ను కాపీ కొట్టారు.. లీసారే ఫైర్