వ్యక్తి యెుక్క పూర్వకర్మల ఫలితాలననుసరించి జయాపజయాలు, సాధనా నిస్పృహలు, ఆకర్షణలు పని చేస్తుంటాయి. ఈ వరుస క్రమంలో అన్ని జరుగువలసిందే.. అందరూ అనుభవించ వలసినవే. అవాంఛనీయ సంఘటనలు తటస్ధించినా వానిని చిరునవ్వుతో స్వీకరిస్తే మన జీవన భారం కొంత తేలిక పడుతుంది.
1. ఇతరుల తప్పిదాలు అవి ఎంత చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో ప్రసంగించకండి. దానివల్ల ఉపయోగమేమీ లేదు.
2. ద్వేషపూరిత హృదయానికి సంతృప్తి కలుగదు. ద్వేషం కార్చిచ్చు వంటిది. శాస్త్రాధ్యయనం వలన మానవుడు మేధావి కాలేడు. మహాత్ముల దైనందిక కార్యములందు సన్నిహితాన్ని పెంపొందించుకొనగలిగిన వాడే జ్ఞానియై రాణించగలడు.
3. దైవ చింతనతో గడుపుతున్న జీవితం స్వల్పకాలమైనా ఉత్తమమైనదే. దైవ భక్తి లేని జీవి లక్షలాది సంవత్సరాలు బ్రతికి ఉన్న ప్రయోజనం శూన్యమే.
4. కష్టపడి పనిచేయి. దేవుడు నామము ఉచ్చరించు. సద్గ్రంధాలు చదువు. వంతులకు, పోటీలకు పోవద్దు. అలా చేస్తే భగవంతునికి ఏహ్యం కలుగుతుంది.
6. మన సంభాషణయందు మనం సత్యాన్ని ఆచితూచి పలకాలి. సాధకుడు మితభాషిగా ఉండాలి.