Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#VastuTips_ అరుస్తూ.. గొడవపడుతూ వంట చేస్తున్నారా? (video)

Advertiesment
vastu
, బుధవారం, 18 నవంబరు 2020 (19:56 IST)
Vastu Tips
వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఐశ్వర్యవంతులు అవుతారని వాస్తు నిపుణులు అంటున్నారు. రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే దుప్పట్లు మడత పెట్టాలి. లేకుంటే జ్యేష్ఠ దేవత అందులో నివాసం వుంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చో కూడదు. 
 
భుజించిన చోట స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చో వాలి. కానీ ప్లేటులో చేతిని కడగటం చేయకూడదు. ఇలా చేస్తే రోగాలు ఖాయం. మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు అలిచిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. 
 
ఇంకా ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు. సంధ్యాకాలంలో నిద్రకూడదు. ఆహారం తీసుకోకూడదు. గొడవలు పడకూడదు, ఆ సమయం ప్రదోషం కాలం ధ్యానం పూజ, మంచి ఫలితం ఇస్తుంది. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు. దేవాలయాలకు వెళ్తే.. అక్కడ అమ్మే విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు.
 
పెద్దలు పాటిస్తున్న పద్ధతులను ఆచరించాలి. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం కచ్చితంగా మంచినీరు ఉంచాలి. ఒక్క కుంది దీపం పెట్టె వాళ్ళు 3 ఒత్తులు వేయాలి, రెండు అంత కన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది. రోజూ వారి దీపారాధనకు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు. కానీ వ్రతము, నోము, దీక్ష, పరిహారాల సమయంలో దీపారాధనకు నువ్వుల నూనె, ఆవు నెయ్యిని వాడాలి. 
 
సాయంత్రం ఆరు దాటాక సూది, ఉప్పు, నూనె, కోడి గుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. అవి శని స్థానాలు. పొద్దు పోయాక పెరుగు, ఊరగాయాలు, మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు
 
జాతకంలో కుజ దోషం ఉన్న వారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్న వారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి, ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి, నీలి, వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. 
 
ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచాలి. పూజగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. వంటచేసే వారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఇలా చేస్తే ఆ ఇంట వుండే మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభించకపోవచ్చునని వారు హెచ్చరిస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నాగుల చవితి' అంటే ఏమిటి..?