వాస్తు ప్రకారం ఏ గృహాన్ని నిర్మించినా...?

మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:22 IST)
వాస్తు అనేది ప్రాచీన నిర్మాణ శాస్త్రం. వాస్తు ఇంటిని అందంగా నిర్మించడానికే కాకుండా సానుకూల శక్తిని కలుగజేస్తుంది. కొన్ని వాస్తు సూత్రాలను పాటించడం మూలానా సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంపన్నకరమైన జీవితాన్ని పొందవచ్చును. అందం అంటే.. ఓ అద్భుతం, ఆకర్షణీయం. ఈ అందం శక్తిని కూడా ఆకర్షించగలదు. 
 
వాస్తు ప్రకారం ఏ గృహాన్ని నిర్మించినా సూర్యుని ఉదయాస్తమయాలను దృష్టిలో ఉంచుకునే నిర్మాణం జరుగుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇలా చేయడం వలన మీ గృహం నూతన శక్తిని సంతరించుకుంటుంది. ఇలా రోజూ సూర్యకాంతి ఇంట్లో ప్రవేశించడం ద్వారా శారీరక మానసిక సమస్యలు తొలగడమే కాకుండా.. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచడంలో సహాయం చేస్తుంది. 
 
సంగీతం అంటేనే మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కనుక శ్రావ్యమైన సంగీతాన్ని ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలయందు సంగీతం వినడం మంచిదని పండితులు చెప్తున్నారు. అలానే గాలి గంటలు లేదా గుడిగంటల నుండి వచ్చు ధ్వని ప్రతికూల ప్రభావాలని దూరం చేస్తుంది. కనుక కనీసం రోజులో ఒకసారైనా ఆ ధ్వని వినడం మంచిది అని పెద్దలు చెప్తుంటారు. 
 
ఆలయాల్లో ప్రవేశించిన వెంటనే సానుకూల ఆలోచనలు, మానసిక ప్రశాంతత రావడం మీరు గమనించే ఉంటారు. ఒకవేళ మీరు నాస్తికులు అయినప్పటికీ ఇలా దేవుని విగ్రహాలు, ఫోటోలు, చిన్న పూజ మందిరాలు గృహంలో ఉండునట్లు చూసుకోవాలి.  

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 16-04-2019 మంగళవారం దినఫలాలు - మిథునరాశివారికి మధ్యవర్తిత్వాల్లో...