Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

ఇంటి కిటికీలకు ఎలాంటి మురికి ఉండరాదు.. ఎందుకంటే..?

Advertiesment
5 Vastu tips
, శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (12:02 IST)
నేటి జీవిత కాలంలో ఎక్కడైనా బయటకు వెళ్ళాంటే.. ముఖ్యంగా కావల్సింది డబ్బే. ఖర్చులు పెరుగుతున్న ఈ ప్రపంచంలో డబ్బులు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టడంతోపాటు వారు వీలైనంత పొదుపు చేయడం అనేది ప్రతి కుటుంబ సభ్యుని కర్తవ్యం. 
 
ఎందుకంటే.. కుటుంబ పెద్ద కొంతవరకు మాత్రమే పొదుపు చేయగలుగుతాడు. మీ ఖర్చులు తగ్గించుకునేందుకు పొదుపు చేసిన మొత్తాలను సరైన ఆర్థిక ప్రణాళికల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి సంపదను సృష్టించడంలో సహాయపడేందుకు ఆర్థిక నిపుణులు చెప్పిన చిట్కాలు, సలహాలు చాలా ఉన్నాయి. ఒక కుటుంబం సంపద పెరగడానికి దోహదపడే 5 సరళమైన మార్గాలు కొన్ని ఇవ్వబడ్డాయి.. అవి ఓసారి పరిశీలిద్దాం..
 
1. గృహిణులు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇంటి కిటికీలకు ఎలాంటి మురికి ఉండరాదు. ఎందుకంటే ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
 
2. ఇక కుటుంబ పెద్ద నగదు లాకర్‌ని దూలం కింది ఎప్పుడూ ఉంచకూడదు. ఇంటి యొక్క స్థానాన్ని బట్టి నగదు లాకర్‌ని ఓ నిర్దిష్ట దిశలో ఉంచాలి. 
 
3. మీ లాకర్‌ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా ముఖ్యం. 
 
4. మరో ట్రిక్ ఉంది, మీ లాకర్‌ని టాయిలెట్ మరియు బాత్రూం కోడకు ఆనించి ఉండరాదు. 
 
5. పిల్లలు ఇంట్లో ఆక్వేరియం ఉంచడం, దానిని క్రమంగా తప్పకుంగా శుభ్రం చేయడం వంటి వాటిపై ఉత్సాహం చూపవచ్చును. వారు పక్షులకు గింజలు, నీటిని ఆహారంగా అందించివచ్చును.
 
సంపదను ఆకర్షించేందుకు వాస్తు ప్రకారం సరళమైన దశలు పైన చెప్పిన ఐదు. కుటుంబ పెద్ద యొక్క అనూకూలమైన దిశ, ఇంటి స్థానం అదేవిధంగా ఇంట్లో ఫర్నిచర్ స్థానం ఆధారంగా అనేక పద్ధతులు ఉన్నాయి. సరళ వాస్తు పండితులు శాస్త్రీయంగా ఓ కుటుంబం తమ సంపదను పెంచుకునే మార్గాలను వివరిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-04-2019 శుక్రవారం దినఫలాలు - విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి...