Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమికుల రోజు: ఏ రాశి అబ్బాయి ఏ రాశి అమ్మాయితో కుదురుతుంది

Advertiesment
ప్రేమికుల రోజు: ఏ రాశి అబ్బాయి ఏ రాశి అమ్మాయితో కుదురుతుంది
, బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (22:23 IST)
వాలెంటైన్ డే సెలబ్రేషన్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. తమ తమ ప్రేయసీ ప్రియుల హృదయాలను మీటగలిగే అపూరూపమైన బహుమతులను ఇవ్వాలని ఉవ్విళ్లూరుతుంటారు. నిజానికి ఎవరికైనా ఓ బహుమతి కొని ఇవ్వాలంటే దానిని ఎంపిక చేసేందుకు కాస్తంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. 
 
ప్రేమికుల విషయానికి వస్తే... గిఫ్ట్ సెలక్షన్‌కు ఓ పట్టాన టైము సరిపోదు. కొంతమంది ఏదో కానిచ్చేద్దాంలే అని అనుకునేవారూ ఉంటారు. కానీ గుండెల్లో గూడుకట్టుకున్న ప్రేమికుడు/ప్రేయసికి ఇచ్చే బహుమతి విషయంలో మాత్రం రాజీ కూడదు. అయితే బహుమతి కొనేముందు మీ లవర్ ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆ బహుమతిని చూసిన మీ లవర్ సంతోషం హద్దులు దాటిపోవాలి. అంతేతప్ప ఎందుకొచ్చిన బహుమతిరా బాబు అని అనుకోకూడదు. ఏయే రాశివారు ఎటువంటి బహుమతులను ఇవ్వాలన్న దానిపై కొన్ని సూచనలు.
 
మేష రాశి ప్రియురాలు/ప్రియుడు 
మేష రాశికి చెందినవారు ధైర్యవంతులు, చురుకైనవారుగానూ ఉంటారు. దేన్నైనా ప్రేమించే మనస్తత్వం కలిగినవారై ఉంటారు కనుక వీరికి ఇచ్చే బహుమతులు విషయంలో కాస్త వెసులుబాటు ఉన్నదనే చెప్పుకోవచ్చు. అమ్మాయిల విషయానికి వస్తే... మంచి హ్యాండ్ బ్యాగులు, హెయిర్ అలంకరణలు, కళ్లద్దాలు, బెల్టులు వంటి బహుమతులతో సంతృప్తిపరచవచ్చు. 
 
అంతేకాదండోయ్... ఎరుపు రంగు రోజాపూలు, మత్తెక్కించే సువాసనల అత్తరులు చాలా చాలా ఇష్టపడతారు. కనుక అటువంటి వాటితో మేష రాశి అమ్మాయిలను ప్రసన్నం చేసుకోవచ్చు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే వీడియో గేములు, సినిమా లేదా పాటల డీవీడీలు, సీడీలు, తాజా సినిమాలకు సంబంధించి టిక్కెట్లు కొని సినిమాకు చెక్కేద్దామంటే ఎగిరి గంతేస్తారు. ఇదీ మేషరాశి అబ్బాయిల పరిస్థితి. తెలుసుకున్నారుగా... ప్రొసీడ్...
 
వృషభరాశికి చెందిన ప్రేమికులు 
ఈ రాశికి చెందినవారు చాలా నెమ్మదస్తులు. ఉన్నతమైన వస్తువులంటే వారికి ఎనలేని ప్రీతి. ఖరీదైన వస్తువుల పట్ల మక్కువ ఎక్కువ. లగ్జరీ ఐటమ్ ఏదైనా వారికి ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. వృషభరాశికి చెందిన అమ్మాయిలు ధగధగలాడే కంఠాభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇవికాకపోయినా బ్రాస్లెట్స్, గాజులు వంటివి సంతోషాన్ని కలిగిస్తాయి. ఇంకా అందమైన దుస్తులను ఇవ్వడం ద్వారా కూడా వీరిని తృప్తిపరచవచ్చు. 
 
ఇక అబ్బాయిల విషయానికి వస్తే... మధుర గాయకులు ఆలపించిన మంచి మంచి పాటల క్యాసెట్లను బహూకరిస్తే చాలు.. ఐస్ అయిపోతారు. అలాకాకపోతే వీడియో గేమ్స్, కార్లలో అలంకరించుకునే ఏదైనా వస్తువు, లేదంటే మంచి విలువు కలిగిన వస్తువైనా వీరిని కట్టిపడేస్తుంది. అవన్నీ కుదరకపోతే ఓ పెద్ద రెస్టారెంట్‌కి తీసుకెళ్లి వారికి నచ్చిన మెనూ ఆర్డర్ చేసి అతనితో కలిసి ఆరగిస్తే చాలు.. తన హృదయం మీకోసమే కొట్టుకుంటుంది. మరింకేం.. ట్రై చేయండి.
 
మిధునరాశికి చెందిన ప్రేమికులు 
మిధునరాశికి చెందినవారు మేధాపరమైన, ఆశ్చర్యాన్ని రేకిత్తించే వస్తువుల పట్ల మక్కువ చూపుతారు. జ్ఞానాన్ని సముపార్జించే ఎటువంటి వస్తువైనా వీరిని సంతృప్తి పరుస్తుంది. మిధునరాశికి చెందిన అమ్మాయిల విషయానికి వస్తే... వీరికి మేధాశక్తిని పెంచే పుస్తకాలతోపాటు లవ్ మెసేజ్‌లను పంపుకునే రికార్డెడ్ పరికరాలంటే చాలా చాలా ఇష్టం. ఇక అబ్బాయిలకు కంప్యూటర్, ఆసక్తికర అంశాలను తెలిపే డీవీడీలంటే ఎంతో ఇష్టం.
 
కర్కాటక రాశికి చెందిన ప్రేమికులు 
వీరు ప్రతిదాన్ని సంప్రదాయబద్ధంగా ఉండాలని చూస్తారు. విలువైన వస్తువులంటే వీరికి ఎంతో ఇష్టం. అమ్మాయిల విషయానికి వస్తే... అందానికి మెరుగులు దిద్దే సాధనాలను బాగా ఇష్టపడతారు. ఖరీదైన ఫోటో ఫ్రేములు కూడా వీరిని ఆకర్షిస్తాయి. ఎందుకంటే.. వీరు తాము ఇష్టపడే ప్రియుని అలా తమ గదిలో ఫోటో ఫ్రేములో బంధించి చూసి ఆనందిస్తుంటారు కనుక. ఇక అబ్బాయిల విషయానికి వస్తే... రొమాంటిక్ క్యాండిల్ లైట్స్ కింద తనకు నచ్చిన అమ్మాయితో డిన్నర్ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ వాలెంటైన్ డే నాడు అటువంటి ఆఫర్‌ను ప్రేయసి ఇస్తే అతడు తన జన్మ ధన్యమైందనుకుంటాడు. సో.. యు కెన్ ప్రొసీడ్ ఇన్ దిస్ వే...
 
సింహరాశికి చెందిన ప్రేమికులు 
తెలివైన, ప్రేమమయ, శక్తివంతమైన, చురుకైన, స్పందించే మనసుగలవారు ఈ రాశికి చెందినవారు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించే వీరు బాస్‌లా ఉండాలని కోరుకుంటారు. అమ్మాయిలు ఇష్టపడే బహుమతుల విషయానికి వస్తే... బంగారు ఉంగరాలు, నగలు, ఖరీదైన దుస్తులంటే వీరికి చాలా ఇష్టం. సింపుల్‌గా నోరూరించే చాక్లెట్ తీసుకెళ్లి నోట్లో పెట్టేసినా హ్యాపీగానే ఫీలవుతారు. ఇక అబ్బాయిల సంగతి చూస్తే... కెమేరాలు, సెల్ ఫోన్లు, డీవీడీలతోపాటు హాట్ డ్రింక్స్‌ను కూడా పుచ్చుకునేందుకు సిద్ధంగానే ఉంటారు.
 
కన్యారాశికి చెందిన ప్రేమికులు
కళాత్మకమైన హృదయం. మంచి కల్పనా శక్తి ఉన్నవారుగా ఉంటారు. అదే సమయంలో చాలా సున్నితమైన మనసు కలిగినవారుగా ఉంటారు. ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటారు. ఒక్కసారి ప్రేమలో పడితే... అవతలి వ్యక్తికోసం ప్రాణాన్నిచ్చేందుకైనా సిద్ధమవుతారు. ప్రేమకు గుర్తుగా శరీరంపై పచ్చబొట్లు పొడిపించుకుంటారు. అమ్మాయిలకు మనస్ఫూర్తిగా ఎటువంటి బహుమతి ఇచ్చినా ప్రేమతో తీసుకుంటారు. అది ఐ లవ్ యూ అని రాసి ఓ తెల్ల కాగితం చేతిలో పెట్టినా దాన్ని జీవితాంతం దాచుకుంటారు. ఇక అబ్బాయిలను చూస్తే... కన్యారాశి అమ్మాయిల మనస్తత్వం ఎటువంటిదో దాదాపు వీరి తత్వం కూడా అలాంటిదే. బహుమతుల విషయంలోనూ అంతే.
 
తులారాశికి చెందిన ప్రేమికులు 
వీరు సహజంగా బిడియస్తులుగా ఉంటారు. అదే సమయంలో చాలా తెలివైన వారుగా కూడా ఉంటారు. అమ్మాయిలను చూస్తే... ఏకాంతంగా గడపాలని కోరుకుంటారు. కనుక వాలెంటైన్ డే రోజున ఏదైనా హిల్ స్టేషన్‌కు తీసుక వెళితే వారి సంతోషానికి హద్దులుండవు. మీతోటితో లోకమవుతుంది. అబ్బాయిలైతే.. ప్రేయసి ఇచ్చే ఏ వస్తువైనా అపురూపంగా చూసుకుంటారు. అది రోజా పువ్వైనా సరే... పావలా చాక్లెట్ అయినా సరే.
 
వృశ్చికరాశికి చెందిన ప్రేమికులు 
అన్ని రాశులవారికంటే వీరు చాలా శక్తివంతులై ఉంటారు. వారి తలరాతనే వారు రాసుకుంటామన్న నమ్మకం వీరిది. వారికి ఇష్టమైనట్లుగా గడపడం వీరి స్టయిల్. వారి జీవితంలో ఎవరు తలదూర్చినా ఒప్పుకోరు. తనకంటూ ఇష్టాయిస్టాలు ముందే చెప్పేస్తారు. వాటిని అనుసరించి మాత్రమే బహుమతులు వగైరా ఏవైనా స్వీకరించేందుకు సిద్ధపడతారు. తేడా వస్తే అంతే. అమ్మాయిలు... అబ్బాయిలదీ ఇదే దారి.
 
ధనుస్సు రాశికి చెందిన ప్రేమికులు 
హాస్యం, చతురత, ధైర్యం గుణాలను కలగలిపిన వారు ఈ రాశికి చెందిన ప్రేమికులు. ఈ రాశికి చెందిన అమ్మాయిలను చూస్తే... ఏ చిన్న బహుమతి ఇచ్చినా పొంగిపోతారు. మనసంతా సంతోషాన్ని నింపుకుని ప్రేమికునితో ఆనందంగా గడపుతారు. ఇక అబ్బాయిలను చూస్తే.. క్రీడలకు సంబంధించిన వస్తువులను బాగా ఇష్టపడతారు. కనుక వారికి నచ్చినవేంటో తెలుసుకుని ఇస్తే చాలు. 
 
మకర రాశికి చెందిన ప్రేమికులు 
స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్.. ఇదే సూత్రం వీరిది. నిదానంగా ఉన్నా స్థిరచిత్తం కలిగినవారుగా ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు... ఓ పట్టాన అర్థం కారు. ఏ బహుమతి ఇచ్చినా ఇచ్చిన బహుమతి గురించి కూడా ఆలోచిస్తారు. కనుక ఆలోచనకు ఆస్కారం లేని ఆభరణాలు వంటివి వీరికి బెస్ట్ ఆఫ్షన్. అబ్బాయిలకైతే... వాచీలు, కార్లలో అలంకరించుకునే వస్తువులు ఇస్తే సరి.
 
కుంభరాశికి చెందిన ప్రేమికులు
స్నేహభావం కలిగినవారు. ఆత్మసౌందర్యాన్ని నింపుకుని ఉంటారు. అమ్మాయిలను చూస్తే... సేవాగుణం తొణకిసలాడుతుంటుంది. ఆ రోజున ఆమెకిచ్చే బహుమతికి బదులు లేనివారికి ఆ బహుమతులను అందజేస్తే ఎంతో సంతోషిస్తుంది. తన ప్రేమికుడి ఉదాత్తమైన గుణాలకు మెచ్చుకుని ఆకాశానికెత్తేస్తుంది. ఇక అబ్బాయిలను చూస్తే... సాయంత్రపు వేళల్లో తన ప్రేయసితో సంతోషంగా గడిపే క్షణాల ముందు ఎటువంటి బహుమతులు నిలవవు. కనుక అలాంటి క్షణాలను అందిస్తే సరిపోతుంది. 
 
మీనరాశికి చెందిన ప్రేమికులు 
కలల్లో విహరిస్తారు. ఎవరిని నొప్పించే మనస్తత్వం కాదు. ఆలోచించేవారుగా, ఆధ్యాత్మిక భావనలు కలిగినవారుగా ఉంటారు. అమ్మాయిల విషయాన్ని చూస్తే... సువాసలను వెదజల్లే పెర్‌ఫ్యూమ్స్, లేదా పూలబొకే వంటివి ఇష్టం. అబ్బాయిలకైతే... మంచి మ్యూజిక్ కలెక్షన్ చాలు. సంగీత లోకంలో ఓలలాడుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిడ్నీ సమస్యలు రాకుండా వుండాలంటే కొత్తిమీర కషాయాన్ని తాగితే...