Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2020 సూర్య పరివర్తనం 12 రాశులపై ఎలా వుంది?

Advertiesment
2020 సూర్య పరివర్తనం 12 రాశులపై ఎలా వుంది?
, బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (16:17 IST)
2020 సూర్య పరవిర్తనం 12 రాశులపై ఎలా వుందో తెలుసుకుందాం.. 2020, ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు తన రాశిచక్రాన్ని మార్చుకుంటారు. దీన్నే పరివర్తనం అంటారు. ఈ పరివర్తనంతో 12 రాశులపై ఎలా ప్రభావం చూపుతుందో చూద్దాం. సూర్యుని కాంతితో విశ్వం ప్రకాశిస్తుంది. సూర్యకాంతితో విశ్వం కదులుతుంది. సూర్య గ్రహం కారకాలు శుభాలే. అలాంటి సూర్యగ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది. 
 
మానవ జీవితంపై సూర్య గ్రహ ప్రభావం వుంటే కీర్తి, గౌరవం లభిస్తుంది. సూర్యుడు ఒక రాశిచక్రంలో ఒక నెల ప్రయాణిస్తాడు. ఫిబ్రవరి 13న సూర్యుడు మకరం నుండి కుంభం వరకు ప్రయాణించబోతున్నాడు. ఈ సమయంలో, వివిధ రాశిచక్ర గుర్తులపై వేర్వేరు ప్రభావాలు కనిపిస్తాయి. 
 
ఈ సూర్యుడి పరవర్తనం కారణంగా ప్రజలకు శుభాలే కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తద్వారా ప్రజలకు గౌరవం, ఆర్థిక ప్రయోజనం వుంటుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. 
 
మేషం: సూర్యుని పరివర్తనం కారణంగా ఈ రాశివారికి ఆర్థికలాభం, కుటుంబంలో సంతోషాలుంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. కీర్తి, గౌరవం పెరుగుతుంది. ఈతిబాధలుండవు.  
 
వృషభం : సూర్యుని ఈ పరివర్తనం వృషభ రాశివారికి ఉపాధి కల్పిస్తుంది. హోదా పెరుగుతుంది. మిత్రుల మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. వేతనం పెంపు వుంటుంది. నాయకత్వంలో రాణిస్తారు.
 
మిథునం : సూర్యుని పరివర్తనంతో ఈ రాశి ద్వారా విజయం వరిస్తుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఉన్నత పదవులు, హోదాలో మార్పు వుంటుంది.
 
కర్కాటకం: ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వ్యక్తిగత రహస్యాలు ఇతరులకు వెల్లడించవద్దు. పూర్వీకుల ఆస్తితో ప్రయోజనం పొందవచ్చు. పెట్టుబడికి లాభం చేకూరుతుంది. తండ్రి ఆరోగ్యం జాగ్రత్త. 
 
సింహం: వివాహ జీవితంలో శుభఫలితాలుంటాయి. ఆరోగ్యానికి సమస్య ఉంటే, దాన్ని అధిగమించవచ్చు. కెరీర్‌లో విజయం సాధించే అవకాశాలు వస్తున్నాయి.
 
కన్య: సూర్యుని పరివర్తనం కారణంగా ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. ఆర్థికంగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.
 
తుల: విశ్రాంతి లభిస్తుంది. విరామాలకు మంచి సమయం. ప్రేమ వ్యవహారానికి ఇది సరైన సమయం కాదు. భాగస్వామితో వివాదం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యక్తుల బదిలీకి అవకాశం ఉండవచ్చు.
 
వృశ్చికం : సూర్యుని పరివర్తనం కారణంగా ప్రవర్తనలో మార్పు వుంటుంది. కాబట్టి ఇతరుల ముందు హుందాగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు ఒత్తిడికి గురవుతారు. జాగ్రత్త వహించండి. 
 
ధనుస్సు : సూర్యుని పరివర్తనంతో ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండాలి. అదృష్టం కలిసివచ్చే కాలం. సమాజంలో గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి.
 
మకరం: ఈ రాశివారికి సంపదకు లోటుండదు. ఎక్కడి నుంచో ఆర్థిక సహాయం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలివిగా పెట్టుబడి పెడితే ప్రయోజనం ఉంటుంది.
 
కుంభం : కుంభంలోనే సూర్యుడి రాశిచక్ర మార్పులు, పరివర్తనం జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాశిచక్రాల జీవితాలలో పెద్ద మార్పులకు సంకేతాలు ఉన్నాయి. వివాహిత జీవితంలో ఇబ్బంది వుంటుంది. కాస్త జాగ్రత్త వహించాలి.
 
మీనం : అన్ని కార్యకలాపాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది. సూర్య పరివర్తనం కారణంగా  ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వుంది. విదేశీ ప్రయాణం విజయాన్ని ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతికూల శక్తులకు చెక్ పెట్టే.. ఉప్పు, మిరపకాయలు.. ఎలా?