టీవీ సీరియల్స్ అంటే చాలు. అందరికీ లోకువే. దానిపై సెటైరిక్ గా సినిమాలలోనూ చూపిస్తూ ఎంటర్ టైన్ చేస్తుంటారు. అత్తా, కోడళ్ళు విలన్లుగా ఎత్తుకు పై ఎత్తుకు వేస్తూ వుండే కథలతో అన్ని టీవీలు నిండిపోతున్నాయి. కానీ అంతో ఇంతో కొంత కొత్తదనం, మానవతా దుక్పథంతో కొన్ని ఛానల్స్ లో ప్రోగ్రామ్ లు రన్ చేస్తున్నా.. ఒక్కో దశలో గాడి తప్పుతున్నాయి. ఆమధ్య సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ బాబుతో రష్మికను పెండ్లి చేసుకోమనే సందర్భంగా ట్రెయిన్ ఎపిసోడ్. పిల్లలు మాట్లాడే విధానంతో.. అమ్మ.. టీవీ సీరియల్స్ ఎక్కువ చూసి చెడిపోతున్నారంటూ మహేష్ సెటైర్ వేశారు. అలాంటి వరకు పర్వాలేదు.
ఇక అసలు ఛానల్స్ లో వచ్చే ప్రోగ్రామ్ లలో కొన్ని సందర్భానుసారంగా వున్నా కొన్ని శ్రుతిమించుతున్నాయి. ఉమెన్స్ డే సందర్భంగా ఓ ఛానల్ శివంగి అనే ప్రోగ్రామ్ చేసింది. మహిళలు ఆర్థికంగా వెనుకబడినవారిని, నటీనటులను తమ స్థాయిమేరకు ప్రోత్సాహం ఇస్తూ శభాష్ అనిపించుకుంది. కానీ అదే క్రమంలో చిన్న పిల్లలతో చేసిన భార్యభర్తల ప్రోగ్రామ్ అస్సలు వర్కవుట్ కాలేదని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. పిల్లలకు భార్యలుగా పెద్దవారిని నటించపచేసి వారి మాట్లాడే భాష, పదాలు, సన్నివేశపరంగా చేసే విన్యాసాలు పిల్లలలో శ్రుజనాత్మక శక్తిని నొక్కేసి నట్లుగా వుంది. అసలు చిన్నపిల్లలతో పెద్ద వారు చేసే ప్రోగ్రామ్ గా చేయించడం తప్పిదమేనని చాలా మంది అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు చైతన్యం కలిగించే విధంగా ఎపోసోడ్ వుండాలి. వారి జిజ్జాసను మేల్కొలిపేవిగా వుండాలి. అందుకే టీవీలో కూడా కొన్ని నియంత్రణలు వుంటే బాగుంటుందని మేథావులు తెలియజేస్తున్నారు.