Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ భాష విశ్వవ్యాప్తం, ప్రతి ఒక్కరూ దానిని అర్థం చేసుకోగలరు: మిలింద్ పాఠక్

image
, శనివారం, 7 అక్టోబరు 2023 (22:44 IST)
దర్శకుడు, నటుడు మిలింద్ పాఠక్ మరాఠీ & హిందీ థియేటర్ మరియు సినిమాలకు కట్టుబడి ఉన్న కళాకారుడు మాత్రమే కాకుండా అన్ని భాషలలోని మానవ కథలపై కూడా లోతైన ఆసక్తిని కలిగి ఉన్నారు. ఆయన తన టెలిప్లే 'వైట్ లిల్లీ అండ్ నైట్ రైడర్' ఇప్పుడు తెలుగులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రేక్షకులకు అందుబాటులో రావటం పట్ల చాలా ఆనందంగా వున్నారు. ఎందుకంటే, ఇది విశ్వవ్యాప్తంగా అభిమానించే ప్రేమ కథ. 
 
ఆయన దీని గురించి మరింతగా వెల్లడిస్తూ, "ప్రేమ యొక్క భాష విశ్వవ్యాప్తం, ప్రతి ఒక్కరూ దానిని అర్థం చేసుకోగలరు. ఉదాహరణకు, 2006లో 'ముంగారు మలే' అనే కన్నడ ప్రేమకథను ఒక సంవత్సరానికి పైగా ఒక మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించారని ఎంతమందికి తెలుసు. ఆ తర్వాత తెలుగు, బెంగాలీ, ఒడియా, మరాఠీ భాషల్లో కూడా రీమేక్ చేయబడింది. ఇప్పుడు 'వైట్ లిల్లీ & నైట్ రైడర్'లు భాషా అవరోధాన్ని అధిగమించనున్నాయి!" అని అన్నారు.
 
'వైట్ లిల్లీ & నైట్ రైడర్' కథనం తెలుగు ప్రేక్షకులను ఎందుకు ఆకట్టుకుంటుంది అని అడిగినప్పుడు, ఆయన మాట్లాడుతూ,"నేను చెప్పినట్లు, ఇది విశ్వవ్యాప్తమైన కథను కలిగి వుంది. ఇది కాలానుగుణమైనది, సమకాలీనమైనది ఎందుకంటే ఇది డేటింగ్ యాప్‌లకు సంబంధించినది. సోషల్ మీడియాను ఉపయోగించే ఎవరైనా ఈ నాటకాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు" అని అన్నారు.
 
దర్శకుడిగా, మిలింద్ వివిధ భాషలలో పని చేసే అవకాశాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, "నేను తెలుగులో నాటకాలకు దర్శకత్వం వహించాలనుకుంటున్నాను. థియేటర్ చాలా అభివృద్ధి చెందింది, అది కేవలం శబ్ద మాధ్యమంగా కాకుండా శక్తివంతమైన దృశ్య మాధ్యమంగా మారింది"అని అన్నారు. 'వైట్ లిల్లీ & నైట్ రైడర్'లో మిలింద్ పాఠక్ మరియు సోనాలి కులకర్ణి నటించారు. దీనిని స్వప్న వాగ్మారే జోషి చిత్రీకరించారు. మిలింద్ స్వయంగా ప్లేకి దర్శకత్వం వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ లో ఈ ఘనత తెలుగు జర్నలిస్టులకే దక్కింది : మెగాస్టార్‌ చిరంజీవి