రచయిత్రి, సామాజికవేత్త సుధామూర్తి తన ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యలకు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. 'ఖానే మే కౌన్ హై' అనే యూట్యూబ్ సిరీస్‌లో ఇటీవల ఇంటర్వ్యూ ఎపిసోడ్‌లో కనిపించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య, తాను స్వచ్ఛమైన శాకాహారిని అని తెలిపారు.
అయితే శాకాహారానికి, మాంసాహార వంటకాలకు చాలా ప్రాంతాల్లో ఒక గరిటెను ఉపయోగించడం తనకు ఆందోళన కలిగించే విషయమని సుధామూర్తి తెలిపారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్న సుధామూర్తి ఆహార విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారట.
"నేను స్వచ్ఛమైన శాకాహారిని, గుడ్లు, వెల్లుల్లి కూడా తినను, నాకు భయం ఏమిటంటే, శాఖాహారం, మాంసాహారం రెండింటికీ ఒకే చెంచా ఉపయోగించబడుతుందని, ఇది నా మనస్సును చాలా బాధిస్తుంది! " అని శ్రీమతి మూర్తి అంగీకరించారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు శాకాహార రెస్టారెంట్లను వెతుకుతానని లేదా తన భోజనాన్ని తానే సిద్ధం చేసుకుంటానని కూడా చెప్పారు.
తన సొంత బ్యాగ్‌లో ఆహారాన్ని తీసుకెళ్తానని.. అలాగే సులభంగా వేడి చేయగల వంట వస్తువులను తనతో పట్టుకెళ్తానని తెలిపారు. ప్రస్తుతం శ్రీమతి మూర్తి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కొంతమంది నెటిజన్లు ఇంటి నుండి ఆహారాన్ని తీసుకువెళ్లడం నిజంగా మంచి పద్ధతి అని అంగీకరించగా, మరికొందరు విభేదించారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.