కచ్చా బాదం ట్రెండ్‌కు పేరుగాంచిన వైరల్ సెన్సేషన్ అంజలి అరోరా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఈసారి, థాయిలాండ్ లోని పట్టాయా క్లబ్‌లో ఆమె బోల్డ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పేరు కొట్టేసిన అంజలి బ్రాండ్ డీల్స్, టీవీ షోలలో కూడా కనిపించింది.
అయితే, రీల్ సంస్కృతి పెరుగుతున్న కొద్దీ, ఆమె ఆన్‌లైన్ క్రేజ్ తగ్గుతున్నట్లు అనిపించింది. ఇందుకోసం అంతర్జాతీయ క్లబ్‌లలో ప్రదర్శన ఇవ్వాలనుకుంది. ఇందులో భాగంగా విదేశాలలో లాభదాయకమైన అవకాశాలను అన్వేషించడానికి ఒక వ్యూహాత్మక మార్గంగా చూస్తున్నారు.
అభిమానులు దీనిని ఒక తెలివైన కెరీర్ ఎత్తుగడగా చూస్తుండగా, విమర్శకులు మాత్రం దీనిని తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా పబ్‌లో ఆమె ప్రదర్శన మాత్రమే కాకుండా ఇతరత్రా అంశాల ద్వారా అంజలి పేరు ట్రెండింగ్‌లో ఉండేలా చూసుకుంటుంది.