Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

Advertiesment
rama mohan naidu

ఠాగూర్

, మంగళవారం, 29 జులై 2025 (15:59 IST)
టీడీపీ నేత, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు డ్యాన్స్ స్టెప్పులు వేశారు. కొందరు యువకులతో కలిసి ఆయన స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీకాకుళంలో జరిగిన తమ బంధువుల ఇంట వివాహ కార్యక్రమానికి రామ్మోహన్ నాయుడు హాజయ్యారు. ఈ సందర్భంగా సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కొందరు యువకులతో కలిసి ఆయన స్టెప్పులేశారు. బంధుమిత్రులతో కలిసి వేదిక ఎక్కిన ఆయన... ఉత్సాహంగా కాలు కదిపారు. మాంచి హుషారైన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. 
 
రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవు అన్నారుగా... క్రికెట్ ఎలా ఆడుతారు : అసదుద్దీన్ ఓవైసీ
 
పాకిస్థాన్‌తో ఒకవైపు ఉద్రిక్తతలు కొనసాగిస్తూనే, మరోవైపు వారితో క్రికెట్ ఎలా ఆడతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. "రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవు" అని చెప్పిన ప్రభుత్వం, ఏ ప్రాతిపదికన వారితో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతోందన్నారు. సోమవారం లోక్‌సభలో 'ఆపరేషన్ సిందూర్'పై జరిగిన చర్చలో ఒవైసీ జోక్యం చేసుకుని, ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు.
 
పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను ప్రశంసిస్తూనే, ప్రభుత్వ వ్యూహాత్మక విధానాల్లోని లోపాలను ఒవైసీ ఎత్తిచూపారు. పాక్ వాణిజ్య సంబంధాలు, సరిహద్దు రాకపోకలు నిలిపివేసినప్పుడు, క్రీడా, సాంస్కృతిక సంబంధాలను కూడా ఎందుకు రద్దు చేయరని ఆయన ప్రశ్నించారు. ఈ ద్వంద్వ వైఖరి, ఉగ్రవాదంపై దేశం తీసుకుంటున్న సీరియస్ వైఖరిని బలహీనపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
భారతదేశ సార్వభౌమత్వంపైనా ఒవైసీ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. "వైట్ హౌస్‌లో కూర్చున్న ఓ శ్వేతజాతీయుడు కాల్పుల విరమణ గురించి ప్రకటిస్తాడు. ఇదేనా మీ జాతీయవాదం?" అంటూ అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం ఒక సార్వభౌమ దేశమని, మన వ్యూహాత్మక నిర్ణయాలను బయటి శక్తులు నిర్దేశించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
 
రక్షణ రంగ సన్నద్ధతపై కూడా ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఫైటర్ జెట్ల కోసం ఫ్రాన్స్ సోర్స్ కోడ్లను ఇవ్వడానికి నిరాకరించిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మనకు 42 స్క్వాడ్రన్లు మంజూరైతే కేవలం 29 మాత్రమే పనిచేస్తున్నాయని, పాకిస్థాన్‌కు 25 స్క్వాడ్రన్లు ఉండగా, చైనా వద్ద 50కి పైగా స్క్వాడ్రన్లు, అత్యాధునిక జలాంతర్గాములు ఉన్నాయని గుర్తుచేశారు. పాకిస్థాన్ చైనా ఆయుధాలు సరఫరా చేసిందా అనే విషయంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని, దీనిపై దౌత్యపరంగా ఎందుకు నిరసన తెలపలేదని నిలదీశారు.
 
భద్రతా వైఫల్యాలపై ఉన్న తాధికారులు జవాబుదారీతనం ఉండాలని ఒవైసీ డిమాండ్ చేశారు. జాతీయ భద్రత, విదేశాంగ విధానాలను రాజకీయం చేయవద్దని హెచ్చరిస్తూ, ప్రభుత్వ మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాలు ప్రజల నమ్మకాన్ని దేశ కీ వ్యూహాత్మక విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అన్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?