Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీకి అద్దె మైకు.. వైకాపాకు సొంత మైకు.. కన్నాపై చంద్రబాబు సెటైర్లు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైనశైలిలో సెటైర్లు వేశారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అద్దె మైకు అయితే... వైకాపాకు సొంత మైకు

Advertiesment
Vijayawada
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైనశైలిలో సెటైర్లు వేశారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అద్దె మైకు అయితే... వైకాపాకు సొంత మైకు అని వ్యాఖ్యానించారు. దీంతో తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వారు.
 
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ సర్కారుపై ఆయన నిత్యం విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. కన్నా విమర్శలపై చంద్రబాబు మంగళవారం స్పందించారు. 
 
'నిన్నే ఒకాయన మాట్లాడుతున్నారు. ఆయన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు. బీజేపీ పార్టీకి కొత్త ప్రెసిడెంటు... అంతకుమునుపు మీరు చూస్తే, వైసీపీలోకి పోవాలని ప్లెక్సీలు, కార్లు అన్నీ సిద్ధం చేసుకుని, చివరి నిమిషంలో ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ అయి, బీజేపీకి అద్దె మైకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత మైకు కింద తయారయ్యారు. ఆలాంటి వ్యక్తులు మనల్ని గురించి విమర్శిస్తారు. ఈ వ్యక్తులే నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు' అని ఎద్దేవా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమను తిరస్కరించిందనీ... గొంతుకోసేశాడు... ఎక్కడ?