Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకులు, వక్కలు... ఇదేగా నీ బతుకు బండ్లా అంటూ విజయసాయి రెడ్డి

Advertiesment
bandla ganesh
, శనివారం, 16 ఏప్రియల్ 2022 (22:57 IST)
వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డికి నిర్మాత బండ్ల గణేష్ కి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. విజయసాయి రెడ్డి ట్విట్టర్లో... ''ఆకులు..వక్కలు..పక్కలు...ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు  ఓడలు కావు. అయ్యో...గణేశా!

 
బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని  భ్రమపడుతుంటారు. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు.

 
వెన్నుపోటు పేటెంటు నీ యజమాని చంద్రబాబుది. 28 ఏళ్లుగా చెక్కు చెదరని గిన్నెస్ రికార్డు. ఇంకో వందేళ్లయినా అది బాబు పేరనే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? ప్రతి కుక్కా సింహం కావాలనుకుటుంది. నీలాంటి వాడే భౌ..భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు.

 
నీవు మర్చిపోయినట్టు నటిస్తున్నా సచిన్ జోషి మాత్రం నిన్ను జీవితాంతం వెంటాడుతుంటాడు. మూవీకి అతను ఫైనాన్స్ చేస్తే రైట్స్ నువ్వు అమ్ముకున్నావంట. చెప్పు తెగేలా కొట్టింది, ఫోన్ పగిలింది నిజమేనా బండ్లా?  రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరీలను ఛీట్ చేసినా వదిలేశారు. అందరూ వాళ్లంత మంచోళ్లు కారు.'' అంటూ విమర్శానాస్త్రాలు సంధించారు.

 
దీనిపై నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్లో... ''ఎస్ నేను కుక్కనే కానీ దానిలా విశ్వాసం ఉన్నవాడిని.. నీలా పిచ్చికుక్కను కాదు తెలుసుకో దొంగ సాయి.. మేము ఏం చేసుకున్నా మా సొంతానికి చేసుకున్నాం కష్టపడ్డాం నీలా దోచుకోలేదు దొంగ సొమ్ము దాచుకోలేదు. ఒక్కటి గుర్తు పెట్టుకో దొంగసాయి.

 
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీ వెనకాల లేకపోతే నీ  చరిత్ర ఏంటో.. నీవు ఏంటో నీ బ్రతుకు ఏంటో ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకో తెలుస్తోంది.. మీ దగ్గర అధికారం ఉంది దొంగసాయి గారూ.. అరెస్ట్ చేయిస్తారో కేసులు పెట్టిస్తారో.. కొట్టిస్తారో ఇంకెన్నేన్ని చేస్తారో. అయినా మీతో నేను పోరాడుతూనే ఉంటా దొంగ సాయి గారు. ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యానవనంలో మొలసిన గంజాయి మొక్క మీరు.. ఆ గంజాయి మొక్కను పీకేసే ఒక తెలుగువాడిగా నా కర్తవ్యం.

webdunia
యస్ నేను కుక్కనే గర్వంగా చెప్పుకుంటా నాకు అన్నం పెట్టి బతుకుని ఇచ్చిన విశ్వాసం గల కుక్కని నీ లాగ పిచ్చి కుక్కని గజ్జి కుక్కని మోసపు కుక్కని కాదు దొంగ సాయి గారు. నా మీద నేను నీ మీద నువ్వు మనం ఇద్దరం సిబిఐ ఎంక్వైరీలు వేసుకుందాం దొంగ సాయి.. ఎవరు కరెక్టో సిబిఐ నిర్ణయిస్తుంది. దమ్ముంటే రా. నువ్వు అన్నావ్ చూడు రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ వీరిలో ఎవరితోనైనా స్టేట్మెంట్ ఇప్పి నేను వారిని మోసం చేశానని, నువ్వు మోసం చేశావు అని దేశం మొత్తం కోట్ల మంది కోడై కూస్తోంది. నువ్వు మోసగాడవి అని, నీవు ముద్దాయివి అని నిను బొక్కలు వేసి జైల్లో పెట్టారు.. ఇది అబద్దమా..?

 
నా మీద ఏ మున్నా ఏది ఉన్నా న్యాయస్థానం నాలాంటి చిన్నవాడిని ఏప్పుడు ఊరుకోదు గుర్తు పెట్టుకో.. దొంగ సాయి ఫోన్లు పగలటం, లాజిక్కులు చేయడం, సినిమాలు తీయడం వ్యాపారం కాదు, తప్పు కాదు దొంగసాయి.. దేశాన్ని దోచుకోవడం, స్కాములు చేయడం, తప్పు పనులు చేయడం అది దొంగపని  సాయి.. సినిమాలు తీయడం, వ్యవసాయం చేయడం, వ్యాపారాలు చేసుకోవడం తప్పుకాదు. జనాన్ని మోసం చేయడం, ప్రభుత్వ సొమ్ము దోచుకోవటం అడ్డంగా బుక్కై జైలుకెళ్లడం తప్పు గుర్తు పెట్టికో దొంగ సాయి.

 
చంద్రబాబు నా బాసా..? నాకు నీతి నియమం ఉంది.. నీలాగా కాదు దొంగ సాయి. నేను ఎప్పటికీ తెలుగుదేశం అభ్యర్థిని కాదు. నేను తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు నాయుడుకి నాకు సంబంధం లేదు దొంగ సాయి గుర్తుపెట్టుకో..? నీకు ఒక ముఖ్య విషయం తెలియజేయాలి దొంగసాయి..  నేను ఎప్పటికీ తెలుగుదేశం కాదు, నేను వైయస్ రాజశేఖర్రెడ్డి గారి అభిమానిని అది నిజమో కాదో కావాలంటే గౌరవనీయులైన రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ బంధువు కెవిపి గారిని అడిగి తెలుసుకో.. దొంగసాయి.. నేను ఏపార్టీయో ఆయన చెబుతారు దొంగ సాయి.

 
ఎవడో చెప్పిన మాటల్ని విని, ఎవరి దగ్గరో ఎంక్వైరీ చేసుకొని ట్వీట్లు పెట్టకు దొంగసాయి.  ఎందుకంటే ఒకటి మనస్సాక్షి అనేది ఉంటది.. నేను తెలుగుదేశం.. నేను చంద్రబాబు మనిషనని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడబాకా.. నాకు బతుకునిచ్చింది, జీవితాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్. నాకు కృతజ్ఞత ఉంటది. నేను తల్లిదండ్రులకు పుట్టా.. నీలాగా నీతిలేని బ్రతుకు నేను బతకను. రాజకీయాల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒక నిజాయితీగా ఉంటా, ఒకరిని అభిమానిస్తా, ఒకరినే ప్రేమిస్తా, ఒకరితోనే ప్రాణం పోయేదాకా తోడుంటా నీ లాగా దొంగ వేషాలు వేయను దొంగ సాయి.

 
నేను చిన్నోన్ని నీ స్థాయి నాది కాదు.. నాది చిన్న స్థాయి. నేను మామూలు వాణ్ణి, నీవు పెద్దోడివి, రాష్ట్రం మొత్తం నీ గురించి గొప్పగా చెప్పుకుంటుంది. గొప్ప వ్యక్తివి, చరిత్ర సృష్టించావ్..'' అంటూ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి ఉషశ్రీ కోసం సంబరాలు.. ఏడు నెలల చిన్నారి ప్రాణాలు?