Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#KIMJONGUNDEAD కిమ్ చనిపోయాడట, వైద్యుడు చేయి వణకడంతో...

#KIMJONGUNDEAD కిమ్ చనిపోయాడట, వైద్యుడు చేయి వణకడంతో...
, శనివారం, 25 ఏప్రియల్ 2020 (23:45 IST)
అగ్రరాజ్యాన్ని గడగడలాడించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చనిపోయాడంటూ పుకారు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. #KIMJONGUNDEAD అంటూ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. హాంగ్ కాంగ్ ప్రసార నెట్‌వర్క్ పేర్కొన్న ప్రకారం, కిమ్ జాంగ్ ఉన్ చనిపోయాడని పుకారు పుట్టిందని తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగిన తరువాత ఉత్తర కొరియా రాకెట్ మనిషిగా పిలుచుకునే కిమ్ నిశ్చలస్థితిలోకి వెళ్లిపోయాడంటూ ఒక జపనీస్ పత్రిక పేర్కొంది.
 
హాంకాంగ్‌లో సైతం ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. హెచ్‌కెఎస్‌టివి హాంకాంగ్ శాటిలైట్ టెలివిజన్ వైస్ డైరెక్టర్ మాట్లాడుతూ... కిమ్ చనిపోయాడని పేర్కొన్నాడు. తన వద్ద ఖచ్చితమైన సమాచారం వుందంటూ చెప్పుకొచ్చాడు. ఐతే ట్విట్టర్లో దీనిపై రకరకాల కామెంట్లు కనబడుతున్నాయి. కిమ్ ఆరోగ్యం విషయమై చైనా వైద్యుల బృందం ఒకటి వెళ్లినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
 
ఇదిలావుండగా కిమ్ గుండె శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో వైద్యుడు స్టెంట్ చొప్పిస్తున్నప్పుడు అతడి చేతులు విపరీతంగా వణకడంతో అది కాస్తా మిస్ ప్లేస్ అయ్యిందని, ఫలితంగా ఆపరేషన్ చేయడంలో తప్పు జరిగిందని ప్రచారం నడుస్తోంది. మరి కిమ్ ఆరోగ్యానికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్సుమెంట్ ఏంటన్నది చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్వారంటైన్‌లోని రోగులకు మటన్ ఫ్రై - చికెన్ బిర్యానీ.. ఎక్కడ?