Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమారస్వామి, వానపాము, యడ్యూరప్ప,.. వీరిలో రైతు స్నేహితులు ఎవరు?

Advertiesment
కుమారస్వామి, వానపాము, యడ్యూరప్ప,.. వీరిలో రైతు స్నేహితులు ఎవరు?
, గురువారం, 28 మార్చి 2019 (14:53 IST)
లోక్‌సభ ఎన్నికల వేళ బెంగళూరుకు చెందిన మౌంట్‌ కార్మెల్‌ ఇంగ్లీష్‌ హైస్కూల్‌ పరీక్షల్లో వివాదాస్పదమైన ప్రశ్నను అడిగింది. ఎనిమిదో తరగతి ప్రశ్నాపత్రంలో రైతు స్నేహితులు ఎవరు? అనే ప్రశ్నను అడిగి దాని కింద మూడు ఆప్షన్లను ఇచ్చింది. ఈ ఆప్షన్లలో మొదటి ఆప్షన్‌ కుమారస్వామి, రెండో ఆప్షన్‌ వానపాము, మూడో ఆప్షన్‌ కింద యడ్యూరప్ప పేరును చేర్చారు. 
 
ఈ విషయం బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. దీనిపై స్కూల్‌ యాజమాన్యం స్పందిస్తూ తాము ఏ పార్టీకి మద్దతివ్వడం లేదన్నారు. ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన టీచర్‌ను సస్పెండ్‌ చేసామని తెలిపారు. 
 
తమ పాఠశాలకు సంబంధించిన ప్రశ్నాపత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ఇబ్బందికరంగా ఉందన్నారు. అయితే మొత్తానికి విద్యార్థులు మాత్రం ఆ ప్రశ్నకు సరియైన సమాధానాన్నే రాసారు. రైతు స్నేహితుడు వానపాము అని విద్యార్థులు గుర్తించారు. 
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు పార్టీలో చేరినా సైకిల్‌ గుర్తుకే ఓటేయమన్న ‘నామా’..?