Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సలసల కాగే నూనెలో వట్టి చేతులతో గారెలు తీస్తారు..

సలసల కాగే నూనెలో వట్టి చేతులతో గారెలు తీస్తారు..
, మంగళవారం, 22 జనవరి 2019 (14:46 IST)
తమిళనాడులోని వడలూరు, పళని వంటి ప్రాంతాల్లో సోమవారం కుమార స్వామిని కొలిచే తైపూసం ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా.. కుమార స్వామికి తమ మొక్కుబడులను నెరవేర్చారు. తైపూసంలో భాగంగా భక్తులు కుమార స్వామికి కావడి ఎత్తడం, నిప్పు తొక్కడం వంటి మొక్కుబడులు నెరవేర్చుకుంటుంటారు. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాలోని దొరప్పాడి గ్రామంలో వినూత్నంగా కుమార స్వామికి భక్తులు మొక్కుబడులు నెరవేర్చారు. అదేంటంటే... సలసల కాగే నూనెలో గారెలను వట్టి చేతులతో కాల్చి స్వామికి సమర్పించారు. వేడి నూనెలో వట్టి చేతుల్ని గరిటెల్లా వుపయోగించారు. ఈ ఉత్సవాల్లో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెస్ట్ పార్లమెంటేరియన్‌గా సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత