రాత్రిపూట అటీవీ ప్రాంతంలో సంచరించే మృగాలను కెమెరాల్లో బంధించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.. భారత అటవీ శాఖాధికారి పర్వీన్ కశ్వాన్. అడవుల్లో సంచరించే అటవీ ప్రాణులను కెమెరాల్లో బంధించి ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేసేందుకు పలు ఛానెల్స్ వచ్చేశాయి.
కానీ లైవ్‌గా వన్య మృగాలతో వుంటూనే వాటి పక్కనే వుంటూ వాటిని కెమెరాల్లో అద్భుతంగా బంధిసున్నారు పర్వీన్ కశ్వాన్. ''నైట్ క్రాలర్స్ ఆఫ్ ది ఫారెస్ట్'' అనే పేరిట వన్య మృగాల ఫోటోలు వాటి వెనుక ఓ స్టోరీని కూడా ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు. ఈ ఫోటోలు, ఆ ఫోటోలకు సంబంధించిన స్టోరీలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
తాజాగా కశ్వాన్ పోస్టు చేసిన నాలుగు ఫోటోల్లో, చిరుత, చారల హైనా, అడవి పంది, అడవీ గార్డ్ కనిపించారు. మూడు జంతువులు, అలానే గార్డు ఒకే రాత్రి వేర్వేరు సమయాల్లో ఒకే ప్రదేశంలో కనిపించారు. ఒకే రాత్రి, ఒకే ప్రాంతం, మూడు వన్య మృగాలు ఒకేచోట కనిపించాయని ది నైట్ క్రాలర్స్ ఆఫ్ ఫారెస్ట్ ట్విట్టర్‌లో తెలిపింది.
ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ ఫోటోలపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అటవీ అధికారులను ప్రశంసిస్తూ ట్వీట్ల వర్షం కురుస్తుంది. ఇంకేముంది. ఆ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి.