Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త పెళ్లి జంటను బైకులపై ఊరేగింపుగా తీసుకెళ్తున్న ఫ్రెండ్స్, కారు వేగంగా దూసుకెళ్లింది- Video

Advertiesment
కొత్త పెళ్లి జంటను బైకులపై ఊరేగింపుగా తీసుకెళ్తున్న ఫ్రెండ్స్, కారు వేగంగా దూసుకెళ్లింది- Video
, సోమవారం, 18 నవంబరు 2019 (20:22 IST)
షాకింగ్ ఘటన ఇది. కేరళలోని కాసర్గోడు పట్టణంలో జరిగిన వివాహ పార్టీ బైక్ ర్యాలీ పైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లడంతో నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన వరుడు- వధువు ఊరేగుతున్న వాహనం ముందు జరిగింది.
 
వివరాల్లోకి వెళితే... వరుడి స్నేహితులు తమ సన్నిహితుల వివాహం జరుపుకునేందుకు బైక్‌లపై కవాతు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ కవాతులో వధువు కూడా వుంటుంది. ఈక్రమంలో తమ స్నేహితుడికి పెళ్లయిన సందర్భంగా అతడి స్నేహితుల ఈ బృందం ఇరుకైన సందు నుండి ప్రధాన రహదారికి మోటారు వాహనాలపై వెళుతుండగా, వెనుక నుండి వస్తున్న ఆల్టో కారు వారిపైకి దూసుకెళ్లింది.
 
ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. కానీ, అదృష్టవశాత్తూ ఎవరికీ తీవ్రమైన గాయాలు ఏమీ తగల్లేదు. ఈ ఘటన జరిగినప్పుడు కారు డ్రైవర్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు స్థానిక మీడియా చానళ్లు సూచిస్తున్నాయి. చూడండి ఈ వీడియో,
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలాపానీ: ఒక్క అంగుళం కూడా వదులుకోం, భారత సైనికులు వెనక్కివెళ్లాలి - నేపాల్ ప్రధాని కేపీ ఓలీ