యాలకులు శృంగారపరమైన సమస్యలకు కూడా అమోఘంగా పనిచేస్తాయని తాజా అధ్యయనాల్లో తేలింది. యాలకులు ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు. ఒత్తిడి, మానసిక సమస్యలను దూరం చేసి మూడ్‌ను మారుస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. శృంగారంలో సరిగ్గా పాల్గొనలేకపోతున్నామని భావించే వారు నిత్యం ఏదో ఒక రూపంలో యాలకులను తీసుకుంటే ఫలితం ఉంటుంది.
రోజూ ఒకటి లేదా రెండు టీస్పూన్ల యాలకులను తీసుకుంటే వీర్య వృద్ధి చెందుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇంకా నపుంసకత్వం సమస్య నుంచి కూడా బయట పడవచ్చు. శృంగారంలో చాలా మందికి శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది. అయితే దానికి యాలకులతో చెక్ పెట్టవచ్చు.
చర్మంపై ఏర్పడే నల్లమచ్చలను యాలకులు పోగొడతాయి. జుట్టు ఊడిపోవడం, వెంట్రుకలు చిట్లడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. యాలకులను నిత్యం తీసుకోవడం వల్ల అజీర్తి తగ్గుతుంది. గ్యాస్ పోతుంది. అధిక బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.