Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదీ చేసిన ప‌నికి షాకైన రాజ‌కీయ నాయ‌కులు, ఇంత‌కీ మోదీ ఏం చేసారు?

Advertiesment
మోదీ చేసిన ప‌నికి షాకైన రాజ‌కీయ నాయ‌కులు, ఇంత‌కీ మోదీ ఏం చేసారు?
, సోమవారం, 14 అక్టోబరు 2019 (13:46 IST)
ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశానికి ప్ర‌ధానమంత్రిగా చేసిన వారంద‌రిలో మోదీ రూటే సెప‌రేటు. మోదీ చేసిన ప‌నితో ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు.. సినీ ప్ర‌ముఖులు.. ఇంకా చెప్పాలంటే సామాన్యుల నుంచి అసామాన్యుల వ‌ర‌కు అంద‌రూ షాక్ అయ్యారు. 
 
ఇంత‌కీ మోదీ ఏం చేసారంటే.. తమిళనాడులోని మహాబలిపురంలో చైనా ప్రధానితో భేటీకి వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ తాను స్టే చేసిన బీచ్‌లో చెత్తను స్వయంగా తొలగించి అంద‌రికీ షాక్ ఇచ్చారు.
 
 బీచ్‌లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ప్రధాని మోదీ తన చేతిలో టార్చ్‌ వంటి పరికరాన్ని పట్టుకున్నారు. 
 
అది టార్చ్‌లైట్‌ అని కొందరు, స్లిమ్‌గా ఉన్న డంబెల్‌ అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. దీని గురించి ప్రధాని మోడీకి ప్రశ్నలు వెల్లువలా వచ్చి పడుతుండటంతో స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా సమాధానం ఇచ్చారు. 
 
నేను చెత్త తీస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న పరికరం గురించి నిన్నటి నుంచి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దాని పేరు ఆక్యుప్రెజర్‌ రోలర్‌. నేను దాన్ని తరచుగా వాడుతుంటాను. ఎందుకంటే నాకది ఎంతో మేలు చేసింది’ అని ట్వీట్‌ చేశారు. 
 
ఆక్యుప్రెజర్‌ రోలర్‌ అనేది చేతిలో ఇమిడిపోయే ఒక రకమైన వ్యాయామ పరికరం. పొద్దున్నే దీన్ని ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఏది ఏమైనా.. ఒక ప్ర‌ధాని అయ్యుండి.. బీచ్‌లో చెత్త‌ను తొల‌గించ‌డం అంటే నిజంగా అభినందించాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ అధినేత చంద్రబాబుకు పులివర్తి నాని సాదర స్వాగతం