Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత పర్యటనలో రెడ్ ఫ్లాగ్ కారునే జిన్‌పింగ్ ఎందుకు ప్రయాణించారు?

భారత పర్యటనలో రెడ్ ఫ్లాగ్ కారునే జిన్‌పింగ్ ఎందుకు ప్రయాణించారు?
, శనివారం, 12 అక్టోబరు 2019 (14:49 IST)
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. శుక్రవారం మధ్యాహ్నం చెన్నైకు చేరుకున్న ఆయన.. శనివారం వరకు ఇక్కడే ఉన్నారు. అయితే, జీ జిన్‌పింగ్‌ తన భారత్ పర్యటనలో కేవలం చైనా ఆటో వర్క్స్ కంపెనీ తయారు చేసిన రెడ్ ఫ్లాగ్‌గా పిలువబడే హాంకీనే వినియోగించారు. 
 
నిజానికి ఆయన బస చేసిన నక్షత్ర హోటల్‌కు ఇండో - చైనా ద్వైపాక్షిక చర్చలకు వేదికైన మహాబలిపురానికి మధ్య 53 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందుకోసం ఆయన హెలికాఫ్టర్‌ను వినియోగించే వెసులుబాటువుంది. కానీ, ఆయన మాత్రం హెలికాఫ్టర్‌ను వినియోగించకుండా కారులోనే ప్రయాణించారు. ఇందుకోసం హాంకీ కారునే వాడారు. 
 
దీనికి చైనా ఉన్నతాధికారులు ఓ కారణం చెబుతున్నారు. చైనా దేశ విధానం ప్రకారం, చైనా నేత‌లు హెలికాప‌ర్ల‌లో వెళ్లడం నిషేధం. దీన్ని వాళ్లు ఓ రూల్‌గా భావిస్తారు. కేవ‌లం విమానాలు, కార్ల ద్వారా మాత్ర‌మే చైనా నేత‌లు ప్ర‌యాణిస్తార‌ని ఆ దేశ అధికారి ఒక‌రు చెప్పారు. 
 
గ‌తంలో జీ20 లాంటి స‌మావేశాల స‌మ‌యంలోనూ.. జిన్‌పింగ్ హెలికాప్ట‌ర్ల‌ను వాడ‌లేద‌ని తెలిసింది. అమెరికా అధ్య‌క్షులు ఎలాగైతే కాడిల్లాక్ బీస్ట్‌లో ప్ర‌యాణిస్తారో.. చైనా అధ్య‌క్షులు కూడా అలాగే హాంకీలోనే వెళ్తుంటారు. నిజానికి శుక్ర‌వారం జ‌రిగిన ఈవెంట్‌కు ప్ర‌ధాని మోడీ.. చెన్నై నుంచి మామ‌ల్ల‌పురానికి హెలికాప్టర్‌లో వెళ్లారు. కానీ జీ జిన్‌పింగ్ మాత్రం కారులోనే ప్రయాణం చేశారు. 
 
ఇకపోతే, 2014లో మొద‌టిసారి చైనా అధ్య‌క్షుడు హాంకీ కారును న్యూజిలాండ్ తీసుకువెళ్లారు. హాంకీ ఎల్‌5 కార్ల‌లో ఆయ‌న అక్క‌డ తిరిగారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన సౌత్ఈస్ట్ ఆసియా స‌మావేశాల స‌మ‌యంలోనూ హాంకీ బుల్లెట్‌ప్రూఫ్ లిమినోజ్‌లో తిరిగారు. అంత‌ర్జాతీయంగా చైనా బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేయాల‌న్న ఉద్దేశంతో జిన్‌పింగ్ ఈ కారులో ప్ర‌యాణిస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. 
 
ఇక క‌మ్యూనిస్టు నేత‌లు ఎవ‌రైనా విదేశీ వాహ‌నాల‌ను వాడ‌రాదు అని, కేవలం చైనా త‌యారీ కార్ల‌నే వాడాల‌ని 2012లోనే జిన్‌పింగ్ ఓ చ‌ట్టాన్ని చేశారు. పైగా, క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ఐడియాల‌జీకి హాంకీని ఓ సింబ‌ల్‌గా భావిస్తారు. 1958లో చైనా ఆటో వ‌ర్క్స్ గ్రూపు దీన్ని త‌యారు చేసింది. చైనాకు చెందిన ఉన్న‌తాధికారులంతా హాంకీ కారులోనే ప్ర‌యాణిస్తారు. 
 
ఆ దేశానికి వ‌చ్చిన విదేశీ నేత‌ల‌ను కూడా ఆ కారులోనే తిప్పుతారు. 1970లో అమెరికా అధ్య‌క్షుడు రిచ‌ర్డ్ నిక్స‌న్ చైనా వ‌చ్చిన‌ప్పుడు .. ఆనాటి నేత మావో ఈ కారునే వాడారు. అయితే 90వ ద‌శ‌కంలో విదేశీ కార్ల మోజులో చైనీయులు హాంకీని ప‌క్క‌న‌పెట్టారు. కానీ 2012లో జిన్‌పింగ్ ఆదేశాల‌తో మ‌ళ్లీ హాంకీ అధికారిక వాహ‌నంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్క పిల్లలపై పంజా విసిరిన నాగుపాము