సైబర్ నేరస్థులు కొత్త కొత్త ఐడియాలతో ప్రజలను మోసగిస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, డిస్కౌంట్ కూపన్లు లేదా ఈవెంట్ పాస్‌ల ముసుగులో, ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి మోసపూరిత లింక్‌లను పంపుతున్నారని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరించారు.
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	బాధితులు ఇలాంటి సందేశాలను అందుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. తక్కువ ధరలకు ఈవెంట్ పాస్‌లు లేదా డిస్కౌంట్‌లను అందిస్తారని మోసం చేస్తారు. అయితే, ఈ లింక్‌లపై క్లిక్ చేయడం ఫోన్ హ్యాకింగ్‌కు గురవుతుంది. ఆపై నేరస్థులు బ్యాంక్ ఖాతా వివరాలతో కూడిన డేటాను దొంగలిస్తారు. 
	 
	అటువంటి లింక్‌లను ఫార్వార్డ్ చేయడం వల్ల ఇతరులు కూడా అదే ఉచ్చులో పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అందుకు తెలియని వారి నుంచి వచ్చే నూతన సంవత్సర శుభాకాంక్షలు, డిస్కౌంట్ ఆఫర్‌లు లేదా ఈవెంట్ పాస్ లింక్‌లను నమ్మవద్దని సైబర్ నిపుణులు ప్రజలను కోరారు.