పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఓ ప్రొఫెసర్ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఒక విద్యార్థిని లైంగికంగా వేధించినందుకు ఆ ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు.
శ్రీ వేంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. క్రాప్ ఫిజియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఉమా మహేష్ ఈ అకృత్యానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. ఇందుకోసం వీడియో ఆధారం దొరికిందని పోలీసులు వెల్లడించారు.
ఈ వీడియో ఆధారంగా పోలీసులు ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీ ఫ్లైఓవర్ దగ్గర ఉమా మహేష్‌ను అరెస్టు చేసినట్లు తిరుపతి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్న గోవిందు మీడియాకు తెలియజేశారు.