Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో ఘోరం.. My mother will die ఆక్సిజన్ కోసం ఓ కుమారుడు..?

యూపీలో ఘోరం..  My mother will die ఆక్సిజన్ కోసం ఓ కుమారుడు..?
, గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:36 IST)
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి తల్లికి కరోనా సోకింది. ప్రైవేటు ఆసుపత్రిలో చేరిపించి చికిత్స చేయిస్తున్నాడు. అయితే..ఈ ప్రైవేటు ఆసుపత్రి నుంచి పోలీసుల బందోబస్తు మధ్య ఆక్సిజన్ సిలిండర్లు తరలిస్తున్నారు.
 
దీనిని తెలుసుకున్న ఆ వ్యక్తి ఆసుపత్రి బయటకు వచ్చి.. మోకాళ్లపై నిల్చొని దండం పెడుతూ ఆక్సిజన్స్ సిలిండర్లను తరలించవద్దని ప్రాథేయపడ్డాడు. ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళితే..తన తల్లి చనిపోతుందని, తాను ఆక్సిజన్ సిలిండర్లను ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించాడు.
 
తన తల్లిని ఆరోగ్యంగా ఇంటికి తీసుకొస్తానని..తన కుటుంబసభ్యులకు మాటిచ్చానని..దయచేసి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లవద్దని మోకాళ్లపై కూర్చొని దండం పెడుతూ ప్రాథేయపడ్డాడు. కానీ..పోలీసులు మాత్రం తమ పనిలో బిజీగా ఉన్నట్లు కనిపించారు. 
 
ఆక్సిజన్ సిలిండర్ ను తీయవద్దని పోలీసులను వేడుకోవడం కండ్లు చమర్చేలా ఉందని, యూపీ పోలీసుల తీరు అమానవీయమని ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ యూత్ కాంగ్రెస్ యోగి సర్కార్ పై విమర్శలు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోగులను సొంత మనుషుల్లా చూసుకుని వైద్యం అందించాలి. : శ్రీకాంత్ రెడ్డి