Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీపీఈ కిట్లు ధరించి.. డ్యాన్స్ చేసిన ఆంబులెన్స్ డ్రైవర్.. వీడియో వైరల్

Advertiesment
పీపీఈ కిట్లు ధరించి.. డ్యాన్స్ చేసిన ఆంబులెన్స్ డ్రైవర్.. వీడియో వైరల్
, గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:30 IST)
పెరుగుతున్న కోవిడ్-19 కేసులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో.. ఒక ఆంబులెన్స్ డ్రైవర్ చేసిన పని ఎంతోమంది హృదయాలను గెల్చుకొంది. కరోనా రోగులను చేరవేసే అంబులెన్స్ డ్రైవర్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. కళ్లముందే చనిపోతున్న రోగులను తరలించే బాధ్యతలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. 
 
ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ ప్రాంతానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్‌.. కాసేపు బాధ్యతలను పక్కన పెట్టి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. పీపీఈ కిట్లు ధరించిన ఆ వ్యక్తి పని ఒత్తిడిని జయించేందుకు పెళ్లి ఊరేగింపులో నాట్యం చేశాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి సుశీలా తివారీ మెడికల్ కాలేజీ సమీపంలో జరిగింది.
 
డెహ్రాడూన్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న హల్ద్వానీ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. కోవిడ్ ఆంక్షల మధ్య జరిగిన ఒక పెళ్లి ఊరేగింపులో పరిమిత సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అకస్మాత్తుగా పీపీఈ కిట్ ధరించిన ఒక వ్యక్తి బరాత్‌ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి డ్యాన్స్ చేశాడు. 
 
బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. ముందు అతడిని చూసి కోవిడ్ సోకిన వ్యక్తి ఏమోనని స్థానికులు భయపడ్డారు. కానీ అతడు హాస్పిటల్ బయట వేచి చూస్తున్న అంబులెన్స్ డ్రైవర్ అని తెలుసుకొని అందరూ కలిసి డ్యాన్స్ చేశారు.
 
అంబులెన్స్ డ్రైవర్ పేరు మహేశ్. కోవిడ్-19 కారణంగా అతడు ప్రతిరోజూ 18 గంటలు వివిధ షిఫ్టుల్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తనలాంటి వారికి విరామం అవసరమని మహేశ్ చెబుతున్నాడు. రోజంతా పీపీఈ కిట్లు ధరించి విరామం లేకుండా పనిచేస్తుడటం ఇబ్బందిగా మారుతోందని తెలిపారు. 
 
మానసిక ఉల్లాసం కోసం పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేశానని వివరించారు. ఆంబులెన్స్ డ్రైవర్ డ్యాన్స్ వీడియోను అతిథుల్లో ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తరువాత ఇది వైరల్ అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్: ‘ఆసుపత్రుల బయట రోడ్లపైనే ప్రాణాలు వదులుతున్నారు’