Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడ్డ పంచెకట్టులో అచ్చమైన తమిళ సంప్రదాయంతో జిన్ పింగ్‌తో మోదీ(ఫోటోలు)

Advertiesment
Narendra Modi
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (17:51 IST)
భారత్ - చైనా దేశాధినేతలు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకు సమీపంలో ఉన్న మహాబలిపురంలో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. మహాబలిపురంలోని కట్టడాలన్నిటినీ సందర్శిస్తూ వాటి ప్రాముఖ్యతను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు వివరిస్తున్నారు.
కాగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు చెన్నైకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా చెన్నై గిండీలో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌కు చేరుకుని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అక్కడ నుంచి ప్రదాని మోడీ - జిన్‌పింగ్‌లు కలిసి మహాబలిపురం చేరుకున్నారు. 
రెండురోజుల పాటు జరిగే ఇరు దేశాల ద్వైపాక్షిక భేటీకి తమిళనాడు తీరప్రాంతం మహాబలిపురం వేదికైంది. ఈ సమావేశంలో ఇరు దేశాలకు చెందిన అగ్రనాయుకులంతా హాజరుకానున్నారు. గతేడాది ఏప్రిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో పర్యటించి.. ఇరుదేశాల స్నేహసంబంధాలపై చర్చించిన విషయం తెల్సిందే. కాశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాజంలో భారత్‌కు పూర్తిగా మద్దతు లభిస్తున్న సమయంలో.. జిన్‌పింగ్‌ పర్యటన మరింత కీలకం కానుంది. 
ఇకపోతే, మోడీ, జిన్‌పింగ్‌ల భేటీ కోసం మహాబలిపురం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రెండు దేశాల జెండాలు.. ధగధగ మెరిసే కాంతులతో వెలిగిపోతోంది. మరోవైపు.. పోలీసులు.. పూర్తిస్థాయి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోంకుడా ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. 
అలాగే.. ఇరు దేశాల ప్రధానిల భద్రత కోసం.. ముందుగా కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇు దేశాధినేత పర్యటన సందర్భంగా చెన్నై నగరంతో పాటు... వారు ప్రయాణించే మార్గాల్లో వాహనరాకపోలపై ఆంక్షలు విధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువ ఎంపీ మాధవి ల‌వ్ స్టోరీ వెన‌కున్న అస‌లు క‌థ‌... ఇంత‌కీ ఏంటా క‌థ‌..?