Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కీలక దశకు చేరుకున్న చంద్రయాన్....

కీలక దశకు చేరుకున్న చంద్రయాన్....
, సోమవారం, 2 సెప్టెంబరు 2019 (14:47 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 ఆదివారం కీలక దశకు చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం 12:45-1:45 మధ్య ఆర్బిటర్ నుంచి ‘విక్రమ్’ ల్యాండర్ విడిపోయింది. జులై 22వ తేదీన నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 గత నెల 20న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నాలుగుసార్లు దాని కక్ష్యను తగ్గించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం ఐదోసారి మరోమారు దానిని కక్ష్య దూరాన్ని తగ్గించారు.
 
చంద్రయాన్ -2 కక్ష్య ఇప్పుడు 119X127 కిలోమీటర్లుగా ఉంది. ఆదివారం చంద్రయాన్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్న వెంటనే ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోతుంది. ఈ ప్రక్రియ 50 మిల్లీ సెకన్లలోనే జరగనుండడం విశేషం. ఆ తర్వాత సోమవారం, మంగళవారం ల్యాండర్ కక్ష్యను మరోమారు తగ్గించి 35X97 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ నెల 7వ తేదీన ప్రయోగం చివరి దశకు చేరుకుంటుంది.
 
చంద్రయాన్-2లోని రాకెట్లను మండించడం ద్వారా దానిని కిందికి దించుతారు. 15 నిమిషాల అనంతరం విక్రమ్ జాబిల్లిపై దక్షిణ ధ్రువానికి సమీపంలో ల్యాండవుతుంది. ఇది జరిగిన 4 గంటల తర్వాత అందులోని రోవర్ బయటకు వచ్చి ప్రయోగాలు చేపట్టి ఆ వివరాలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు పంపుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా జోలికొస్తే విశాఖలో లేకుండా చేస్తా : గంటాకు స్ట్రాంగ్ వార్నింగ్