Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రయాన్‌కు చిక్కిన జాబిలి... ఫోటోను విడుదల చేసిన ఇస్రో

Advertiesment
ISRO
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల నింగిలోకి పంపిన చంద్రయాన్ పనితీరు భేషుగ్గా ఉంది. ప్రస్తుతం ఇది చంద్రుడు కక్ష్యలో 2,650 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. పైగా, అంత ఎత్తులో నుంచి చంద్రుడుని ఓ ఫోటో తీసి భూమికి చేరవేసింది. ఈ ఫోటోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. 
 
ఇంద్రయాన్ 2 ప్రాజెక్టును భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెల్సిందే. చంద్రయాన్ 2 మిషన్‌లోని ల్యాండర్, రోవర్ సెప్టెంబర్ 7న తెల్లవారు జామున 1.40 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండ్ కానున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్తి కానుందని అధికారులు వెల్లడించారు. 
 
అయితే, చంద్రయాన్ చంద్రుడు కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత తొలి అద్భుతాన్ని ఆవిష్కరించింది. చంద్రుడిని తన కెమెరాలో బంధించిన చిత్రాన్ని భూమిపైకి పంపింది. ఎల్-14 కెమెరాతో రాత్రి సమయంలో చంద్రయాన్-2 ల్యాండర్ చిత్రీకరించిన ఫోటోను ఇస్రో విడుదల చేసింది. 
 
ఇక ఈ ఫోటోను ట్వీట్ చేసిన ఇస్రో, చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్స్‌ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్‌ ఓరియంటేల్‌ అనే మరొక పెద్ద బిలాన్ని చిత్రంలో చూడవచ్చని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వోడాఫోన్‌ను అధికమించలేకపోతున్న జియో...