Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసిన చంద్రయాన్-2 - లక్ష్యం దిశగా...

Advertiesment
మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసిన చంద్రయాన్-2 - లక్ష్యం దిశగా...
, మంగళవారం, 6 ఆగస్టు 2019 (17:20 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2 మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసింది. ఈ స్పేస్ మిషన్ క్రాఫ్ట్ లక్ష్యం దిశగా సాగుతోంది. ఈ క్రమంలో భూకక్ష్యను అధిగమించే క్రమంలో ఐదో దశను విజయవంతంగా పూర్తిచేసింది. తద్వారా చంద్రుడి సమీపానికి చేరుకుంది. 
 
ఈ ప్రక్రియ కోసం స్పేస్ క్రాఫ్టులోని ప్రొపల్షన్ వ్యవస్థను 1041 సెకన్ల పాటు మండించారు. దాంతో, స్పేస్ క్రాఫ్టు నిర్దేశిత 276×142975 కి.మీ కక్ష్యలో అడుగుపెట్టింది. తదుపరి ప్రక్రియలో భాగంగా చంద్రయాన్-2 ఈ నెల 14వ తేదీన భూకక్ష్యను దాటి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. 
 
మరోవైపు, ఇటీవల చంద్రయాన్-2 మిషన్‌కు అమర్చిన ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఈ నెల 3వ తేదీన ఇస్రో విడుదల చేసిన విషయం తెల్సిందే. జాబిల్లిపై నుంచి భూమిని పరిశీలిస్తే, నీలిరంగులో భూమి మెరిసిపోతుంది. ఈ ఫోటోలను ట్విట్టర్‌లో ఇస్రో షేర్ చేయగా, ఇవి వైరల్ అయ్యాయి. మొత్తం నాలుగు ఫోటోలను చంద్రయాన్-2 మిషన్‌కు అమర్చిన ఎల్ఐ4 కెమెరా తీయగా, వాటిని శాస్త్రవేత్తలు షేర్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'