మహారాష్ట్రలో ఓ రైల్వే ఉద్యోగి సాహసం చేశాడు. రైల్వే ప్లాట్‌ఫాంపై ఓ చిన్నారి తమ తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే అదుపుతప్పి ఆ చిన్నారి రైలు పట్టాలపై పడ్డాడు. ఆ సమయంలోనే అటు నుంచి పట్టాలపై రైలు వేగంగా దూసుకువస్తోంది. దీన్ని గమనించిన రైల్వే ఉద్యోగి ఏ మాత్రం ఆలోచించకుండా.. చిన్నారి వైపు పరుగుపెట్టారు. రైలు కూడా అదే వేగంతో ముందుకు వస్తోంది.
రెప్పపాటులో ఆ చిన్నారిని రైల్వే ఉద్యోగి పట్టాలపై నుంచి ఫ్లాట్‌ఫాంపైకి పడేసి.. తాను కూడా పైకి ఎక్కాడు. దీంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ముంబై డివిజన్‌లోని వాంగాని రైల్వేస్టేషన్‌లోని రెండో ఫ్లాట్‌ఫాంపై చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగిని మయూర్ షేల్కేగా గుర్తించారు. చిన్నారి ప్రాణాలు కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రైల్వే ఉన్నతాధికారులు అతన్ని అభినందించారు.