పాము అంటేనే జనం జడుసుకుంటారు. అయితే ఓ వ్యక్తి పాము అంటే అదీ కొండ చిలువను కూడా లెక్క చేయలేదు. వివరాల్లోకి వెళితే, చిన్నపాటి అటవీ ప్రాంతం.. ఆ మార్గం నుంచి కొందరు ఓ వాహనంలో వెళుతున్నారు. రోడ్డు మధ్యలో ఓ పెద్ద కొండ చిలువ వుంది.
ఎంత హారన్ కొట్టినా పక్కకు తొలగిపోలేదు. ఇంతలో వాహనంలోంచి ఓ వ్యక్తి ధైర్యంగా దిగి కొండ చిలువ దగ్గరికి వెళ్లాడు. దాని తోక భాగం వైపు వెళ్లిన వ్యక్తి.. కర్ర వంటిదేమీ లేకుండా ఉత్త చేతులతోనే కొండ చిలువను పట్టుకుని లాగి.. పక్కనతోసేశాడు. వాహనంలోని వారు వద్దు వద్దని గట్టిగా అరుస్తున్నా వెనక్కి తగ్గలేదు.
తోక పట్టుకోగానే కొండ చిలువ ఒక్కసారిగా ఆ వ్యక్తి వైపు వెనక్కి తిరిగింది. కరవడానికి సిద్ధమైంది. అయినా అతను భయపడలేదు. తోక పట్టుకుని గట్టిగా లాగి రోడ్డు పక్కకు పడేశాడు. ఆ వెంటనే కొండ చిలువ వేగంగా పొదల్లోకి పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కాశ్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. "దక్షిణ భారత దేశంలోని ఓ వ్యన్యప్రాణి అభయారణ్యంలో తీసిన వీడియో ఇది. వన్యప్రాణులు ఉండే చోటికి వెళ్లినప్పుడు.. వాటిని డిస్టర్బ్చేయకుండా, రోడ్డు ప్రమాదానికి లోను కాకుండా కాపాడారు."అని క్యాప్షన్ పెట్టారు.