Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీవో 111 ప్రస్తుత స్ధితి మీ ప్రోపర్టీ కొనుగోలు నిర్ణయాన్ని ఆలస్యం చేస్తుందా?

outer ring road
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (23:52 IST)
హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్‌ లోపల ఆస్తులు కొనుగోలు  చేయడానికి ఇది సరైన సమయమేనా?. హైదరాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రోపర్టీ, ప్లాట్స్‌ కొనుగోలు పరంగా పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత ఖచ్చితమైన సమయమిది. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఇప్పుడు అత్యుత్తమ స్థితిలో ఉంది. దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు ఈ మార్కెట్‌ పట్ల అమితాసక్తి కనబరుస్తున్నారు. తమ నగదును ఈ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
 
గత ఆరు నెలలుగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో జీఓ 111 కారణంగా అనిశ్చితి కనిపిస్తుంది. జీఓ 111 కారణంగా ఎలాంటి ప్రభావం ఉంటుందోనని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు కానీ, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇది అన్ని రకాలుగానూ ప్లాట్‌ కొనుగోలుదారులకు ప్రయోజనకరంగానే ఉంటుంది. జీఓ 111ను అలాగే ఉంచడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ ధరలు పెరగడంతో పాటుగా ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టుపక్కల ప్లాట్స్‌‌కు డిమాండ్‌ కూడా గణనీయంగా పెరుగుతుంది.
 
జీఓ 111ను ఎత్తేయడం వల్ల ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలోని ఆస్తుల ధరలు అధికంగా పెరిగేందుకు సైతం తోడ్పడుతుంది. ఈ జీఓ ఎత్తేయడం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. అందువల్ల, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఔటర్‌ రింగ్‌ రోడ్‌ లోపల ప్లాట్‌ కొనుగోలు పరంగా వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటి వరకూ ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో  హైదరాబాద్‌ ఒకటిగా నిలిచింది. అన్ని పెద్ద సంస్థలూ తమ కార్యాలయాలను ఈ నగరంలో ఏర్పాటుచేస్తుండటంతో పాటుగా దేశవ్యాప్తంగా వేలాదిమందికి ఉద్యోగాలనూ అందిస్తున్నాయి.
 
హైదరాబాద్‌ చుట్టు పక్కల సంపూర్ణమైన అభివృద్ధి కనిపిస్తోంది. అన్ని ప్రాంతాలూ వేగంగా విస్తరిస్తుండటంతో పాటుగా భూముల ధరలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ నగరానికి దక్షిణాన ఉన్న ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, ఇంజాపూర్‌లలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో వేగవంతంగా పెరుగుదల కనిపిస్తుంది. బీఎన్‌ రెడ్డి నగర్‌, సాహెబ్‌ నగర్‌ కలాన్‌, గుర్రం గూడా వంటివి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాగార్జున సాగర్‌ రోడ్‌కు సమీపంలో హైదరాబాద్‌కు దక్షిణాన, ఔటర్‌ రింగ్‌ కోడ్‌కు లోపల ఉండటం వల్ల తమ సొంత ప్లాట్‌ కోనుగోలు చేయాలనుకునే, తమ సొంత ఇంటి నిర్మాణం చేయాలనుకునే కొనుగోలుదారులకు అత్యుత్తమ అవకాశంగా నిలుస్తుంది. ఈ ప్రాంతాలు అత్యంత సురక్షితమైన పెట్టుబడి మార్గాలుగా ఉండటంతో పాటుగా అత్యధిక విలువనూ అందిస్తాయి.
 
సాఫ్ట్‌వేర్‌ అగ్రగామి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ తమ క్యాంపస్‌ను ఆదిభట్ల, హైదరాబాద్‌ దక్షిణ భాగంలో మెట్రోస్టేషన్‌  సైతం రానుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు సైతం గణనీయంగా పెరగనున్నాయి. ఈ ప్రాంతాలలో ఏదైనా ప్లాట్‌ లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు తమ పెట్టుబడులను గురించి పూర్తి నిశ్చింతతతో  ఉండవచ్చు. వారి ప్రోపర్టీ విలువ గణనీయంగా పెరగడంతో పాటుగా వారు అధిక రాబడులను సైతం  తమ పెట్టుబడులపై ఆశించవచ్చు.
 
ఈ ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ అనుమతించిన ప్రాజెక్టులన్నింటిపై జీవో 111 ప్రభావమేమీ ఉండదు. ఈ ప్రాంతంతో పాటుగా చుట్టు పక్కల ప్రాంతాలలో తమ పెట్టుబడులను గురించి కొనుగోలుదారులు పూర్తి నిశ్చింతతో ఉండవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో వరుసగా పలు రోడ్‌ షోలను నిర్వహించిన శ్రీలంక టూరిజం