Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడికత్తి ఉపద్రవం మా జీవితాలను నాశనం చేసింది: శ్రీదేవి తొట్టెంపూడి - video

Sridevi Tottempudi

ఐవీఆర్

, శనివారం, 11 మే 2024 (12:29 IST)
ఎన్నో ఏళ్లుగా హాయిగా సంతోషంగా గడిచిపోతున్న మా జీవితాలను అధోగతి పాల్జేసారు అంటూ జగన్ సర్కారుపై విరుచుకపడ్డారు బాధిత వ్యాపారస్తురాలు శ్రీదేవి. ఆమె మాటల్లోనే.... ''నువ్వు ఫలానా కులంలో పుట్టావు కాబట్టి నువ్వు టార్గెట్ అని మన పాలకులే టార్గెట్ చేస్తే ఇంక ఎవరికి చెప్పుకోవాలి? నా పేరు శ్రీదేవి తొట్టెంపూడి. నా భర్త స్టీల్ ప్లాంటులో కాంట్రాక్టులు పెట్టి కష్టపడి సంపాదించారు. ఆయనకు రెస్టారెంట్ పెట్టాలని కల. అది నిజం చేసుకోవాలని కష్టపడి సంపాదించిన సొమ్మునంతా విశాఖలో రెస్టారెంట్ పెట్టాము. నేను లా పూర్తి చేసుకుని నా భర్త వ్యాపారానికి వెన్నుదన్నుగా నిలిచాము.
 
ఐతే కోడికత్తి అనే ఉపద్రవం మా జీవితాలను నాశనం చేసారు. మేము చంద్రబాబు గారికి మద్దతుగా వున్నామనీ, కోడికత్తి వ్యవహారం మేమే నడిపించామని అపవాదు వేసారు. మీ మీడియాలో ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేసారు. కష్టపడి పైకి వచ్చిన మాకు ఇలాంటి పనులు ఎందుకు చేయాలి. మాలాంటి ఎందరో వ్యాపారస్తులు ప్రతిరోజూ రాత్రనకా పగలనకా కష్టపడుతో చమటోడ్చుతుంటాము. అలాంటి మాపై నిందలు వేసారు. కోర్టులకు ఎక్కించారు. నడుస్తున్న వ్యాపారాన్ని మూసేయించే పరిస్థితికి తెచ్చారు. వ్యాపారం దెబ్బతిని తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇప్పుడు సతమతమవుతున్నాము.
 
ముఖ్యమంత్రితో సహా అదికారులు అంతా కలిసి 500 మంది వుంటారా అన్నా... ఈ 500 మంది 5 కోట్ల మంది జీవితాలతో ఆడుకున్నారు. ఒక్కసారి నమ్మి మోసపోయాము. మళ్లీ మరోసారి మోసపోవద్దు. చదువుకున్నా ఉద్యోగాలు రాక డ్రగ్స్ కి బానిస అవుతున్న యువకుల జీవితాలు అలా కాకూడదని ఓటు వేయండి. వ్యాపారాలు లేక అప్పులు పాలవుతున్న చిన్నవ్యాపారులను చూసి ఓటేయండి. ఓటు మాత్రం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే వేయండి. అమరావతి రాజధాని ఏర్పాటు చేసేవారికే వేయండి. ఏదో పార్టీలో మేము అభిమానించే నాయకుడు వున్నాడంటే గుండెల్లో పెట్టుకుని పూజించుకోండి కానీ ఓటు మాత్రం ఏపీ అభివృద్ధి చేసేవారికే వేయండి" అంటూ ముగించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ఎన్నికలు.. స్వస్థలాలకు జనం.. హైదరాబాద్‌- విజయవాడ హైవేపై రద్దీ