Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం కేసీఆర్ కొత్త పార్టీ ... బీఆర్ఎస్ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్??

cmkcr
, సోమవారం, 13 జూన్ 2022 (17:22 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని తపనపడుతున్నారు. ఇందుకోసం ఆయన వివిధ విపక్ష పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో ఓ కూటమని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు. 
 
అయితే, కూటమి ఏర్పాటుపై ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ఆయన సొంతంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ పార్టీకి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అనే పేరు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలనే పట్టుదలతో ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై దాదాపు ఆరు గంటలకు పైగా తన సన్నిహితులతో చర్చించారు. 
 
బీఆర్ఎస్ పార్టీని స్థాపించే ముందు తెలుగు ప్రజల సాయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా బీఆర్‌ఎస్ విస్త‌రించే ప్ర‌ణాళిక‌లను కేసీఆర్ రూపొందిస్తున్నారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు పిలిపించి సుదీర్ఘంగా చర్చించారు. 
 
అదేవిధంగా తమ కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ను ప్రకటించేందుకు బీజేపీ క్యాడర్ పెద్దగా ఆసక్తి చూపని తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కేసీఆర్ రాజకీయ సాయం కోరినట్లు సమాచారం. ఈ రాజకీయ మార్పులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో భోజనం చేసి తల్లిని పరామర్శించి ఈడీ ఆఫీసుకు వచ్చిన రాహుల్