Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిత్యానంద ఆచూకీ చెప్పాలని ప్రపంచ దేశాలను కోరిన ఇంటర్ పోల్

Advertiesment
నిత్యానంద ఆచూకీ చెప్పాలని ప్రపంచ దేశాలను కోరిన ఇంటర్ పోల్
, గురువారం, 23 జనవరి 2020 (12:18 IST)
నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య నిత్యానందకు, ఓ నటికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేసి.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిత్యానంద చాలారాష్ట్రాల్లో ఆశ్రమాలు నడుపుతూ బోధకుడిగా, ఆయన శిష్యులకు గురువుగా చెలామణీ అవుతున్నాడు. అయితే ప్రస్తుతం మైనర్ అమ్మాయిలను కిడ్నాప్ చేశాడని ఆరోపణలు రావడంతో గుజరాత్ పోలీసులు నిత్యానందను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఇలాంటి సమయంలో దేశం విడిచిపారిపోయిన నిత్యానంద ఏకంగా దక్షిణ అమెరికా దేశం సమీపంలోని ఓ దీవిని సొంతంగా కొనేశాడని, దానికి కైలాస దేశంగా ప్రకటించుకున్నాడని, ఆ దేశానికి తమిళ నటిని ప్రధాని చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ నిత్యానంద నకిలీ పాస్ పోర్టుతో దేశం విడిచిపారిపోలేదని, ఇక్కడే ఎక్కడో తలదాచుకున్నాడని, త్వరలోనే ఆయన్ను అరెస్టు చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ నిత్యానంద ఆచూకీ చెప్పాలంటూ ఇంట‌ర్‌పోల్ ప్ర‌పంచ దేశాల‌ను కోరింది. గ‌తేడాదే ఆధ్మాతిక‌వేత్త నిత్యానంద్ విదేశాల‌కు పారిపోయాడు. అయితే నిత్యానంద ఆచూకీ తెలపాలంటూ ఇంట‌ర్‌పోల్ బ్లూకార్న‌ర్ నోటీసులను జారీ చేసింది. అయితే ఇటీవ‌లే నిత్యానంద‌ ఈక్వెడార్‌లో తాను కైలాసాన్ని నిర్మించ‌నున్న‌ట్లు ఓ వీడియో ద్వారా చెప్పారు. దీంతో  నిత్యానంద వివాదం కాస్త‌ ముదిరింది.
 
కానీ నిత్యానంద‌ ఈక్వెడార్‌లో లేర‌ని, హైతీకి పారిపోయిన‌ట్లు ఈక్వెడార్ ఎంబసీ స్ప‌ష్టం చేసింది.  ఓ దీవిని కొని, దానికి  కైలాసం అని నిత్యానంద‌ పేరుపెట్టిన అంశాన్ని కూడా ఈక్వెడార్ కొట్టిపారేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెలెక్ట్ కమిటీలోనూ చక్రం తిప్పుతాం.. ఎందుకంటే.. : యనమల కామెంట్స్