Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#InternationalTigerDay పులులు పెరిగాయ్.. మోదీ హర్షం.. మనమే టాప్!

Advertiesment
India
, సోమవారం, 29 జులై 2019 (12:17 IST)
ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ టైగర్‌ దినోత్సవాన్ని జూలై 29, 2015న నిర్వహిస్తున్నారు. పులుల ఆవాసాలు, విస్తరణ కోసం ఈ రోజును టైగర్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. పులుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో పులుల పరిరక్షణపై అవగాహన కోసం ఈ రోజును అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 
 
మానవులు నగరాలను విస్తరించుకుంటూ పోతున్న కారణంగా, వ్యవసాయం కారణంగా పులులప 93 శాతం మేర సహజ ఆవాసాలను కోల్పోయాయి. గత 100 సంవత్సరాలలో, 97 శాతం అడవి పులులను ప్రపంచం కోల్పోయింది. లెక్క ప్రకారం 1913లో 1,00,000  ఉన్న పులులు 2013లో 3274కి తగ్గిపోయాయి. ఆ తర్వాత 2014లో 3200కు పులుల సంఖ్య పడిపోయింది.
 
అత్యధిక సంఖ్యలో 2226 పులులతో భారతదేశం అగ్రస్థానంలోనూ 500 పులులతో మలేషియా రెండో స్థానాన్ని అనుసరిస్తుంది. 2004లో 440 పులులు మూడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్, టైగర్ సెన్సస్ 2015లో 106కు పులుల జనాభా క్షీణతను చవిచూసింది. 
 
ఇకపోతే.. పులులు అంతరించిపోకుండా వుండేందుకు గాను 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌ బర్గ్ టైగర్ సమ్మిట్ జూలై 29వ తేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించింది. ఇంకా ఈ సమావేశంలో భాగంగా 2022 కల్లా ప్రపంచ పులుల జనాభా రెట్టింపు చేయాలని నిర్ణయించింది.
 
అలాగే అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్-2018ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. మనదేశంలో నాలుగేళ్లలో 700 పులులు పెరిగాయని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. 
 
ప్రస్తుతం దేశంలో 2,967 పులులున్నాయని 'ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్-2018' చెబుతోందన్నారు. పులులకు అత్యంత ఆవాసయోగ్యమైన దేశాల్లో భారత్‌ కూడా ఒకటని చెప్పారు. పులుల సంఖ్య పెరగడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో చికెన్ ముక్క.. అలా ఎగిరిపడి.. ఎవరి నోటా పడకుండా జంప్ అయ్యిందా? (video)