బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి తన కుమార్తె అంటే ప్రాణం. ఆమె ఏది అడిగినా ఆమె కోసం చేస్తారు. తన కుమార్తె ఏ సెలెబ్రిటీనీ కలవాలన్నా.. అందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తారు. గతంలో క్రికెటర్లను కూడా కౌశిక్ రెడ్డి తన తనయ కోసం కలిసేలా వారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసిచ్చారు. తాజాగా తన కుమార్తె పుట్టిన రోజును పురస్కరించుకుని.. భావోద్వేగ పోస్టు చేశారు. అలాగే ఓ వీడియోను కూడా పోస్టు చేశారు.
ఈ పోస్టులో.. పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియమైన శ్రీనికా.. నువ్వు నా గర్వం, ఆనందం మాత్రమే కాదు, నా కలల సజీవ స్వరూపం, నా బలం, నా వారసత్వం. జీవితంలో మీ ప్రయాణం ధైర్యంగా, సాహసోపేతంగా ఉండనివ్వండి. మీ హృదయం ఎల్లప్పుడూ దయతో ఉండనివ్వండి.
మీలో ఇప్పటికే ప్రకాశిస్తున్న అదే దయ, ధైర్యంతో నా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లండి. నేను నిన్ను పదాలు వ్యక్తపరచలేనంతగా ప్రేమిస్తున్నాను. ప్రతిరోజు నువ్వు నన్ను మునుపటి రోజు కంటే గర్వపరుస్తున్నావు. నీ ప్రేమగల అమ్మానాన్న.." అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.