Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుభవం.. పట్టుదలతోనే బోటును వెలికితీసాం.. బోటు ఆపరేషన్లీ సక్సెస్ : ధర్మాడి సత్యం

అనుభవం.. పట్టుదలతోనే బోటును వెలికితీసాం.. బోటు ఆపరేషన్లీ సక్సెస్ : ధర్మాడి  సత్యం
, మంగళవారం, 22 అక్టోబరు 2019 (19:54 IST)
మా అనుభవం, పట్టుదలతోనే కచ్చలూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటును వెలికి తీసినట్టు ఈ బోటును వెలికితీత పనులు చేపట్టిన బృందానికి నాయకత్వం వహించిన ధర్మాడి సత్యం వెల్లడించారు. ఈయన నేతృత్వంలోని బృందం గత కొన్ని రోజులుగా శ్రమించి, నీటిలో మునిగిపోయిన బోటును 38 రోజుల తర్వాత మంగళవారం వెలికి తీసిన విషయం తెల్సిందే. 
 
ఈ ఆపరేషన్‌పై ధర్మాడి సత్యం మీడియాతో మాట్లాడుతూ, బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన రోజున పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పారు. వరద నీటి ప్రవాహం పెరిగిపోవడం కారణంగా వెలికితీత పనులు మధ్యలో ఆగిపోయాయని, ఆ తర్వాత మళ్లీ ప్రారంభించడం జరిగిందన్నారు. 
 
అయితే, సోమవారం నదిలో ప్రవాహం పెరిగిందని, అయినప్పటికీ, బోటును బయటకు తీయాలన్న పట్టుదలతో పనులు ఆపలేదన్నారు. బోటును బయటకు తీసేందుకు మొత్తం మూడు రోప్స్ వేశామని, అందులో రెండు రోప్స్‌ను కింద నుంచి వేసి బయటకు లాక్కురాగలిగామని చెప్పారు.
 
మొదటిరోజున నదిలో లోతు సుమారు 26 మీటర్లు ఉండగా, ఈ రోజు 24 మీటర్ల లోతు ఉందని, ఆ లోతులో నుంచి బోటును బయటకు తీశామని, బోటు వెలికితీత పనుల్లో తమ బ్యాచ్ 25 మంది పాల్గొన్నట్టు వివరించారు. 
 
ఈ రిస్క్యూ ఆపరేషన్‌లో రెవెన్యూ, పోలీస్, పోర్టు అధికారుల నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని చెప్పారు. ముఖ్యంగా, బోటును వెలికితీయాలన్న పట్టుదలతో పాటు.. మా బృందం సహకారం, అనుభవం వల్లే తాము విజయం సాధించినట్టు తెలిపారు. పైగా, ఇప్పటివరకు తాము చేపట్టిన ఏ ఒక్క ఆపరేషన్ కూడా విఫలం కాలేదని, ఈ విషయంలో తాను సంతోషం వ్యక్తం చేసినట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త విధానం ద్వారా నిత్యం 45వేల టన్నుల ఇసుక.. మంత్రి పెద్దిరెడ్డి