Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌ను జైలుకు పంపిన వ్యక్తి జగన్ పార్టీలో చేరుతున్నారా?

Advertiesment
జగన్‌ను జైలుకు పంపిన వ్యక్తి జగన్ పార్టీలో చేరుతున్నారా?
, సోమవారం, 4 మే 2020 (19:16 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
మాజీ సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ వైయస్ జగన్ ఆస్తుల కేసును విచారించి జైలుకు పంపినప్పుడు, మాజీ సిబిఐ జెడిని అతని నిజాయితీ, ప్రామాణికమైన దర్యాప్తు జరిపారంటూ ఆయనపై ప్రశంశలు జల్లు కురిపించారు.

ఐతే సమయం క్రమంగా మారుతూ వుంటుంది. చూస్తుండగానే లక్ష్మీ నారాయణ తన పదవికి రాజీనామా చేసి, విశాఖలో ఎంపీ సీటు కోసం జనసేన తరపున పోటీ చేశారు. కానీ, ఆ తరువాత ఆయన ఆ నియోజకవర్గంలో వైఫల్యాన్ని రుచి చూశారు.
 
ఆ తర్వాత జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిలకడ లేని వ్యక్తి అని చెప్పి పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి బయటకు వచ్చేశారు. ఐతే ఇటీవల ఆయన వైయస్ జగన్‌ పనితీరును ప్రశంసిస్తూ మాట్లాడారు. లాక్ డౌన్ విషయంలో జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కితాబిచ్చారు. ఈ క్రమంలో ఆయనను వైసీపీలో చేరుతారా అని అడిగితే దానికి ఆయన చేరను అని చెప్పలేదు.
 
ఈ నేపధ్యంలో రాజకీయ విశ్లేషకులు లక్ష్మీ నారాయణ త్వరలో వైకాపాలో చేరవచ్చనీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వైజాగ్ నుండి ఎంపిగా పోటీ చేస్తారని అంటున్నారు. నిజమే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ వుండరని అంటారు కదా. ఈ ప్రకారం చూస్తే లక్ష్మీనారాయణ వైసీపీలో చేరవచ్చని అనుకోవచ్చేమో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ ఎఫెక్టు :: ఊరిలో మొగుడు .. ఇంట్లో ప్రియుడు.. ఎక్కడ?