Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యతో కలిసి టిఫిన్ చేసి మేడపైకెళ్లి కోడెల ఉరి...

Advertiesment
EX AP Speaker
, సోమవారం, 16 సెప్టెంబరు 2019 (14:55 IST)
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, తెదేపా సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద రావుది ఆత్మహత్యేనని తెలుస్తోంది. ఆయన సోమవారం ఉదయం 10 గంటలకు భార్యతో కలిసి టిఫిన్ చేశారు. ఆ తర్వాత 10:10 నిమిషాలకు మొదటి అంతస్తులో ఉన్న బెడ్రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకున్నారు.
 
కొద్దిసేపటి తర్వాత కోడెల డోర్ లాక్ చేసినట్టు గుర్తించిన భార్య తలుపులు తెరవాలంటూ కోడెలను రిక్వెస్ట్ చేశారు. ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో వ్యక్తిగత గన్ మెన్‌ని పిలిచారు కోడెల సతీమణి. అతడు వెనుక డోర్ బద్దలు కొట్టి లోపలకి వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్‌కు ఉరి వేసుకొన్నారు కోడెల.
10 గంటల 40 నిమిషాలకు కారులో హస్పిటల్‌కు తరలించారు. 10 గంటల 50 నిమిషాలకు బసవతారకం తీసుకువెళ్లినప్పటికీ కోడెల చనిపోయానట్టు నిర్దారించారు. 11 గంటల తర్వాత పోలీసులకు వైద్య సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఎస్సై రాం రెడ్డి ఆస్పత్రికి వెళ్లారు. ఆత్మహత్య కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. 

ఆత్మహత్య చేసుకోవడం వల్ల కోడెల చనిపోయినట్టు నిర్దారణకు వచ్చారు. కోడెలది ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకున్న గదిని స్వాధీనం చేసుకున్నారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదంటున్న పోలీసులు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోటప్పకొండకు కోడెల పరమభక్తుడు.. చిట్టడివి నుంచి పర్యాటక ప్రాంతంగా?