Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#SarojiniNaidu వర్ధంతి.. కులం, మతం అంటే భారత కోకిలకు గిట్టదు..

Advertiesment
#SarojiniNaidu వర్ధంతి.. కులం, మతం అంటే భారత కోకిలకు గిట్టదు..
, మంగళవారం, 2 మార్చి 2021 (09:41 IST)
Sarojini Naidu
దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహనీయుల్లో పురుషులే కాదు.. మహిళలు కూడా వున్నారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఒకరు. ఆమె వర్ధంతి నేడు. సరోజినీ దేవి చటోపాధ్యాయ హైదరాబాదులో శ్రీమతి సరోజినీ నాయుడు అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, వరద సుందరీ దంపతులకు 1879 ఫిబ్రవరి 13న వారి ప్రథమ సంతానంగా ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబములో జన్మించింది. 
 
తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ తూర్పు బెంగాల్‌కు చెందిన గొప్పవిద్యావేత్త, డా.ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందిన మొదటి భారతీయుడు. నిజాం కాలేజీ స్థాపకుడు, శాస్త్రవేత్త, తత్వవేత్త. తల్లి భువనసుందరి దేవి ఒక కవయిత్రి. బెంగాలీయుల ఆడపడుచు, తెలుగు వారి కోడలు.. సరోజినీ పన్నెండో ఏట మద్రాస్ యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రథమురాలిగా నిలిచి పలువురి ప్రశంసలందుకుంది. 13సంవత్సరంలోనే ది లేడి ఆఫ్ ద లేక్ పేరున 1300 పంక్తుల కవితను ఆరు రోజుల్లో రాసింది. 
 
చిన్నతనం నుంచీ ఆమెకు ఇంగ్లీషు భాషమీద చాలా మక్కువ ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూండేది. ఆ పట్టుదలా, ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో చదువుకుంది. పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది. 
 
ఆమె పన్నెండవ ఏట మదరాసు విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలూ, విద్య యందు ఆమెకు గల భక్తి భావం మనం అర్థం చేసుకోవచ్చు. 1898వ సంవత్సరం విదేశాలలో విద్య పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక, ఆమె శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు గారిని పెండ్లాడటం జరిగింది. ముత్యాల గోవిందరాజులు నాయుడు అప్పటి హైదరాబాద్ ప్రధాన ఔషధారోగ్యాధికారి. 
 
కులం మతమూ అనే మూఢవిశ్వాసాలంటే శ్రీమతి సరోజినీ నాయుడికి చిన్నతనం నుంచే ఏవగింపు. ఈ కుల, మతము లేకమై జాతి జీవనంపై గొడ్డలి పెట్టు పెడుతూ, వర్గ భేదాన్ని సృష్టించి ధనవంతులు, నిరుపేదలు, బలవంతులు, బలహీనులు అంటూ జాతిని వేర్పాటు ధోరణికి బలి చేస్తుందనీ, కుల మతాతీత భావాలతో పెరిగే ప్రజానీకం మాత్రమే సమ సమాజ స్థాపన చెయ్యగలరనీ ఆమె అభిప్రాయం. 
webdunia
Sarojini Naidu
 
ఆమె మహిళాభివృద్దికి ఎంతో కృషిచేసి 1906లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటు పడ్డారు. స్వాతంత్ర్య సాధనలో తనూ పాలుపంచుకోవాలని ఆలోచించిన శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోనారంభించింది. 1915 వ సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకూ, 1916లో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొనటం జరిగింది. ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి.
 
భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన కవయిత్రి. సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా బాధ్యతలు నిర్వర్తించారు. భారత దేశంలో బ్రిటీష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడింది.  పురోగతినీ, స్వచ్ఛమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్య జీవితాలను వాంఛించిన పురుష కవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా స్త్రీయై ఉండి కూడా జాతి విమోచనానికి శాయశక్తులా అహోరాత్రులు కృషి చేసిన త్యాగపూరిత కవయిత్రి శ్రీమతి సరోజినీనాయుడనటంలో ఏమాత్రం సందేహం లేదు. 
 
ఇక దక్షిణాఫ్రికాలో భారతీయులు అనుభవిస్తున్న దుర్భర బానిసత్వాన్ని అర్థం చేసుకొని అక్కది వారి హక్కులకోసం పోరాడేందుకు 1926 వ సంవత్సరం శ్రీమతి సరోజినీ నాయుడు దక్షిణాఫ్రికా వెళ్ళి వారికెంతో సేవ చేసింది. ఇక తనే దేశం, దేశమే తనుగా భావించి దేశ సేవ చేసిన అభేద భావాల మూర్తి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకం అని నిరూపించిన మహితాన్వితురాలు. 
 
జీవితమంతా మానవ సేవకు, దేశసేవకూ అంకితం చేసి తన డెబ్బైవ యేట 1949 మార్చి 2వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్నుమూసింది. భారత కోకిలగా పేరొందిన... కులాంతర వివాహం చేసుకొని ఆదర్శంగా నిలబడిన ఆమెకు ఈ రోజు వర్ధంతి కావడంతో సోషల్ మీడియాలో ఆమెకు పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్న‌పిల్ల‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి 5 ఎక‌రాల స్థ‌లం: టిటిడి ఈవో