Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాట్ ఏ ఐడియా.. : స్కూలు బస్సునే మొబైల్ స్కూల్ ‌బస్సుగా మార్చేశారు..

mobile school bus
, బుధవారం, 17 మే 2023 (18:49 IST)
కొందరి ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. వారి ఆలోచనలకు తగిన విధంగానే వారి చర్యలు కూడా ఉంటాయి. తాజాగా వ్యక్తికి వచ్చిన ఆలోచనతో ఏకంగా మొబైల్ స్కూల్ తయారైంది. ఏకంగా స్కూల్ బస్సును మొబైల్ స్కూలు బస్సుగా మార్చేశారు. మురికివాడల్లోని చిన్నారులకు విద్యాబోధన అందిస్తూ వారి తలరాతల్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన విద్యాకుంజ్-విద్యాపీఠ్ గ్రూప్ విద్యకు దూరంగా ఉంటూ ఎక్కడో మురికివాడలు, ఫుట్పాత్‌లలో నివసించే పేద పిల్లలకు విద్యనందించే సంకల్పంతో బ్రహ్మాండమైన వసతులతో మొబైల్ స్కూల్‌ను ఏర్పాటుచేసింది. బస్సులోనే బెంచీలు, టీవీ, ఇంటర్నెట్, ఫ్యాన్, లైట్లు వంటి అత్యాధునిక వసతులు కల్పించింది. 
 
అంతేకాకుండా బస్సును తరగతి గదిలా తీర్చిదిద్ది విద్యార్థులకు రోజూ పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. పిల్లలు ఉండే చోటకు రోజూ ఆ సంస్థ ప్రతినిధులు వెళ్తూ వారిని తీసుకొచ్చి జాగ్రత్తగా బస్సులోకి ఎక్కించి వినోదాత్మకంగా పాఠాలు బోధిస్తున్నారు. 
 
ఫుట్‌పాత్‌లపై నివసించేవారితో సహా పిల్లలందరికీ విద్య అవసరమని తమ ఆశయమని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదువుతోనే పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందన్నారు. ఈ మొబైల్ స్కూల్ ద్వారా బస్సులో సాధ్యమయ్యే ప్రతి సౌకర్యాన్నీ అందించేందుకు తాము ప్రయత్నించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ బస్సులో 32 మంది పిల్లలు ఉన్నారని.. ఈ సంఖ్య పెరిగితే మాత్రం మూడు గంటలు చొప్పున రెండు బ్యాచ్లుగా తరగతులు నిర్వహించనున్నట్టు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలక్‌పేట తీగలగూడ వద్ద తల లేని మహిళ మృతదేహం