ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని పార్క్‌కి పిలిచి తన కోరిక తీర్చుకున్నాడు. ఆ వీడియోలో ఒక అబ్బాయి తన స్నేహితురాలిని అరటి తోటకు పిలుస్తాడు. ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్సులోనే తోటకు వస్తుంది. ఈ స్కూల్ లవర్స్‌తో పాటు మరో వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు.
ఆ వ్యక్తి కుంకుమ బరిని పట్టుకుని ఉంటాడు. అబ్బాయి కుంకుమ తీసుకొని అమ్మాయి నుదిటిపై పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అమ్మాయి వద్దంటూ నిరాకరిస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత బాలుడు తన ప్రియురాలి నుదిటిపై సిందూరం దిద్దుతాడు. దాంతో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకుంటాడు.
ప్రియుడు నుదిటిపై సిందూరం దిద్దిన అనంతరం ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. చాలా సిగ్గుపడుతూ చిరు నవ్వులు చిందించింది. ఈ వీడియో బీహార్ పరిసరాల్లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో రెండు వారాల క్రితందే అయినా.. ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతోంది.