Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటి అద్దె చెల్లించని వైకాపా ఎంపీ.. మరో వివాదంలో గోరంట్ల మాధవ్

gorantla madhav
, బుధవారం, 9 నవంబరు 2022 (10:31 IST)
హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా మరో వివాదంలో చిక్కున్నారు. తాను ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించడం లేదు. పైగా, ఇంటి యజమానులపైనే తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇంటి యజమానురాలు పోలీసులను ఆశ్రయించినప్పటికీ న్యాయం జరగక పోవడంతో మీడియాను ఆశ్రయించారు. ఇంటి అద్దె రూపంలో గోరంట్ల మాధవ్ రూ.13 లక్షలు చెల్లించాల్సివుంది. అలాగే, కరెంట్ బిల్లుగా మరో రూ.2.50 లక్షలు చెల్లించాల్సివుంది. 
 
ఇటీవల ఓ మహిళతో న్యూడ్ వీడియో వ్యవహారంలో వివాదంలో చిక్కున్న గోరంట్ల మాధవ్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఈ వివాదానికి పోలీసులు, వైకాపా ప్రభుత్వ పెద్దల సాయంతో తెరదించారు. ఇపుడు ఇంటికి అద్దె చెల్లించకుండా వివాదంలో చిక్కుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివాదాన్ని పరిశీలిస్తే, అనంతపురంలోని రాంనగర్‌లు తన రెండు అంతస్తుల ఇంట్లో ఇద్దెకు ఉంటున్నారు. ఆ తర్వాత గడువు దాటినా ఆయన ఇంటిని ఖాళీ చేయలేదు. పైగా, ఇంటి అద్దె కూడా చెల్లించలేదు. ఈ వ్యవహారంపై పెద్ద మనషుల ద్వారా పంచాయతీ జరగడంతో కొంత సమయం ఇచ్చారు. ఈ గడువు అక్టోబరు నెలాఖరుతో ముగిసింది. 
 
అయినప్పటికీ ఆయన ఖాళీ చేయడం లేదు. పైగా ఇంటి యజమానురాలితో గొడవకు దిగుతున్నారు. తాను ఇల్లు మారేది లేదంటూ తెగేసి చెబుతున్నారని ఇంటి యజమాని మల్లిఖార్జున రెడ్డి ఆరోపించారు. సీఐలు శివరాముడు, జాకీర్ హుస్సేన్ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినకపోగా తనకే హెచ్చరికలు జారీచేశారని తెలిపారు. తనకు ఇంటి అద్దెగా రూ.13 లక్షలు, కరెంట్ బిల్లు కింద రూ.2.50 లక్షలు చెల్లించాలని మల్లికార్జున రెడ్డి వాపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో అత్యం కాలుష్య నగరాల జాబితా రిలీజ్.. వైజాగ్‌కు చోటు