Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాటేసిన పామును ఆస్పత్రికి తీసుకొచ్చిన యువకుడు

Advertiesment
king cobra
, బుధవారం, 20 డిశెంబరు 2023 (16:15 IST)
ఉత్తరప్రదేశ్‌లోని బండాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని పాము కాటు వేసింది. ఆ తర్వాత యువకుడు పామును పట్టుకుని నేరుగా ఆస్పత్రికి చేరుకున్నాడు. పామును ఆస్పత్రికి ఎందుకు తీసుకొచ్చారని వైద్యుడు యువకుడిని అడిగాడు. ఆ పామే తనను కాటేసిందని డాక్టర్‌తో చెప్పాడు. అలా ఆస్పత్రికి పామును తీసుకొచ్చిన పామును చూసిన యువకుడిని చూసి వైద్యులు షాకయ్యారు. 
 
ఈ ఘటన మతోంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలంఖోర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో నివాసముంటున్న యోగేంద్ర మంగళవారం మధ్యాహ్నం పొలంలో పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. అక్కడ విషపూరిత పాము కాటేసింది. దీంతో అతని పరిస్థితి విషమించడం ప్రారంభించింది. ఆ పరిస్థితిలోనూ యోగేంద్ర పామును పట్టుకుని డబ్బాలో పెట్టాడు. 
 
పెట్టెలో యోగేంద్ర తెచ్చిన పామును చూసి అందరూ అవాక్కయ్యారు. వెంటనే వైద్యులు యోగేంద్రకు చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం నిలకడగా వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ మూడు రాష్ట్రాల్లో కరోనా సబ్ వేరియంట్ : కేంద్రం అలెర్ట్